ఫోన్ నెంబర్లు ఇవ్వాలని మహిళలను వేధించిన తాగుబోతు.. దేహశుద్ధి చేసిన స్థానికులు.. కర్ణాటకలో ఘటన (వీడియో)

Published : Dec 30, 2022, 03:35 PM IST
ఫోన్ నెంబర్లు ఇవ్వాలని మహిళలను వేధించిన తాగుబోతు.. దేహశుద్ధి చేసిన స్థానికులు.. కర్ణాటకలో ఘటన (వీడియో)

సారాంశం

కర్ణాటకలో ధార్వాడ్ జిల్లాలో ఓ వ్యక్తి ఫుల్‌గా తాగేసి మద్యం మత్తులో రోడ్డుపై తిరుగుతూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. వారి నెంబర్లు ఇవ్వాలని అడిగాడు. దీంతో స్థానికులు అతడిని దేహశుద్ది చేశారు.   

బెంగళూరు: కర్ణాటకలో ఓ వ్యక్తి మందు తప్పతాగి రోడ్డుపైకి వచ్చి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కనిపించిన మహిళ వద్దకు వెళ్లి ఫోన్ నెంబర్ కావాలని వేధించాడు. దీంతో ఆ తాగుబోతుకు స్థానికులు దేహశుద్ధి చేశారు. చెప్పుతో ఆ మందుబాబు మత్తు వదిలించారు. అతని ముంఖం, తలపైనా చెప్పుతో ఓ మహిళ కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.

ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో జరిగింది. తప్పతాగి రోడ్డెక్కిన ఆ వ్యక్తి మహిళల వద్దకు వెళ్లి ఫోన్ నెంబర్లు అడిగాడు. ఈ విషయం గ్రహించిన స్థానికులు కొందరు.. మహిళలతో కలిసి ఆ వ్యక్తిపై దాడి చేశారు. మహిళలు కొందరు చెప్పులతో కొట్టారు.

Also Read: భర్తను చంపించింది.. ఉరితాడుకు బాడీని వేలాడదీసి ఆత్మహత్య కథ అల్లింది.. చివరికి..!

లిక్కర్ మత్తులో ఉన్న ఆ వ్యక్తి దెబ్బలు పడుతూనే ఉన్నాడు. ప్రతిఘటించలేదు. అయితే, కొట్టవద్దని బ్రతిమాలుకుంటున్నాడు. రోడ్డుపై లాక్కెళ్లుతున్న సందర్భంలో అతడు కిందపడిపోయాడు. రోడ్డుపై నుంచి అతడిని పక్కకు తీసుకెళ్లారు. అక్కడ కూడా అతడి చుట్టూ గుమిగూడి దాడి చేశారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !