భార్యతో గొడవ వీడియోని షేర్ చేసిన యూట్యూబర్.. చివర్లో ట్విస్ట్..!

Published : Dec 30, 2022, 03:32 PM IST
భార్యతో గొడవ వీడియోని షేర్ చేసిన  యూట్యూబర్.. చివర్లో ట్విస్ట్..!

సారాంశం

అందులో... అతను తన భార్యతో గొడవ పడుతూ ఆ వీడియోని షేర్ చేశాడు. కాగా... చివర్లో అతను ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. నెటిజన్ల రియాక్షన్ కూడా అదిరిపోయింది.  

ప్రస్తుతం యూట్యూబ్ లో వీడియోలు చూసేవారు ఎంత మంది ఉన్నారో... ఆ యూట్యూబ్ లో రకరకాల వీడియోలు తీసి షేర్ చేసేవారు అంతకు మించి ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ తెలిసిన విషయాలను వీడియోలు తీసి.. యూట్యూబ్ లో షేర్ చేస్తున్నారు. అవి జనాలకు నచ్చితే.. వ్యూస్ రావడం.. డబ్బులు సంపాదించడం కామన్ గా మారిపోయింది. తాజాగా..  ఓ యూట్యూబర్ కూడా ఓ వీడియోని షేర్ చేశాడు. అందులో... అతను తన భార్యతో గొడవ పడుతూ ఆ వీడియోని షేర్ చేశాడు. కాగా... చివర్లో అతను ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. నెటిజన్ల రియాక్షన్ కూడా అదిరిపోయింది.  ఇంతకీ మ్యాటరేంటంటే....

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లీష్ ట్యుటోరియల్ వీడియోలను పోస్ట్ చేసే కంటెంట్ సృష్టికర్త గౌరవ్, తన భార్యతో తన అగ్లీ ఫైట్ వీడియోను పోస్ట్ చేయడంతో అతని అనుచరులు షాక్ అయ్యారు. ఆ వీడియో చివర్లో అతను ఇచ్చిన ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంది.  ఇది అతని ట్యుటోరియల్ వీడియోలో ఒక భాగం అని తెలిసి అందరూ నవ్వుకున్నారు.

వీడియోలో ఏముందంటే... ఇళ్లు శుభ్రంగా ఉంచడం లేదని.., బెడ్రూమ్, హాలు చెత్త చెత్తగా ఉందని భార్యను తిడుతూ ఉన్నాడు. వీడియోలో అదంతా చూపిస్తూ భార్యను తిడుతూ ఉన్నాడు. అదంతా చూస్తూ ఉన్న ఆయన భార్య అతనితో గొడవ పడటం మొదలుపెట్టింది.  ఇద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరుకుంది. ఆమె వెంటనే విడాకులు తీసుకుందామని అడిగింది. వారి పాప వెంటనే విడాకులు వద్దు అని అడగడం.. అప్పటి వరకు సీరియస్ గా సాగింది. అయితే.. ఆ తర్వాత.. విడాకులు(  divorce) అనే పదాన్ని ఎలా పలకాలో చివర్లో వివరించడం విశేషం. అప్పటి వరకు గొడవ అనుకునన వారంతా.. తర్వాత అది ఇంగ్లీష్ ట్యూటోరియల్  అని తెలిసి నవ్వుకున్నారు. కావాలంటే వీడియో మీరు కూడా చూసేయండి.


 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !