నీటితో నిండి ఉన్న క్వారీలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి.. ఛత్తీస్‌గఢ్‌లో ఘటన

By team teluguFirst Published Dec 31, 2022, 9:02 AM IST
Highlights

కారు అదుపుతప్పి నీటితో నిండి ఉన్న క్వారీలోకి పడిపోవడంతో నలుగురు చనిపోయారు. మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నీటితో నిండి ఉన్న ఓ క్వారీలోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో నలుగురు మరణించారు. ఒకరు సురక్షితంగా భయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐదుగురు కుటుంబ సభ్యులు ఓ కారులో ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం భిలాయ్‌గఢ్‌ జిల్లాలోని తిమర్లగా గ్రామానికి శుక్రవారం తిరిగి వస్తున్నారు.

‘నా వల్ల ఆమె బాధపడకూడదు’.. ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమ్ లో యువకుడి ఆత్మహత్య..

ఈ క్రమంలో సారన్‌గఢ్‌-భిలాయ్‌గఢ్‌ జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా రాయ్‌పూర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో నీటితో నిండి ఉన్న క్వారీలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. అయితే ఇందులో ఉన్న 15 ఏళ్ల బాలిక మునిగిపోతున్న కారులో నుంచి బయటకు వచ్చి ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకుంది.

గోవాలో ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ సమన్వయ సమావేశం.. ఎప్పుడంటే..?

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్వారీలో నుంచి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా.. ఇదే రాష్ట్రంలోని కబీర్‌ధామ్ జిల్లాలో గత శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ మనీషా ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో మృతి చెందిన వారంతా తమ బంధువు అంత్యక్రియల కోసం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ కు వెళ్లారు. అక్కడి నుంచి తమ స్వస్థలమైన బెమెతర జిల్లాకు కారులో తిరిగి వస్తున్నారు.

న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో 63 లక్షల కేసులు ఆలస్యం: ప్రధాన న్యాయమూర్తి

ఈ క్రమంలో కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోల్మీ ఘాటి వద్దకు శుక్రవారం తెల్లవారుజామున చేరుకున్నారు. అయితే ఈ సమయంలో కారు అదుపుతప్పి 50 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. కారును బయటకు తీసుకొచ్చేందుకు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

గులాం నబీ ఆజాద్ తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారా? ఇంతకీ ఆయన ఏం సమాధానమిచ్చారు.

కారును బయటకు తీసినప్పటికీ అందులో ఉన్న ఫాగు యాదవ్ (60), సతీ బాయి (35), కౌశిల్య (70) అనే మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మల్తీ (45) అనే మహిళ తీవ్రగాయాలతో బయటపడింది. అయితే ఆమెను చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే పరిస్థితి విషమించి చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నట్టు పోలీసు సూపరింటెండెంట్ మనీషా ఠాకూర్ చెప్పారు.

click me!