ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

Published : Dec 16, 2022, 02:16 PM IST
ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

సారాంశం

ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో శుక్రవారం ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికుల సాయంతో పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. 

ఒడిశాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మయూర్‌భంజ్ జిల్లాలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు నిర్ధారించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని చెప్పారు.

అన్నను చంపి, శవాన్ని మంచం కింద దాచిపెట్టాడు.. తండ్రి సాయంతో పారేసి.. చివరికి..

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బస్సు ప్రయాణికులను తీసుకొని ఖిచింగ్ నుండి బరిపాడకు నేషనల్ హైవే నెంబర్ 18పై వెళ్తోంది. ఈ క్రమంలో కులియానా చౌక్ సమీపంలోకి చేరుకునే సరికి బోల్తా పడింది. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులందరినీ స్థానికుల సహాయంతో బరిపాడలోని పండిట్ రఘునాథ్ ముర్ము మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు