రెండేళ్లలో 23 వేల ఎఫ్‌ఐఆర్‌లు.. 55వేల అరెస్టులు..

Published : Dec 16, 2022, 01:41 PM IST
రెండేళ్లలో 23 వేల ఎఫ్‌ఐఆర్‌లు.. 55వేల అరెస్టులు..

సారాంశం

కరోనా మహమ్మారి సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేసిందనీ, 2020 మార్చి నుండి 2022 మార్చి మధ్య కాలంలో ఢిల్లీ పోలీసులు జరిమానాగా రూ. 59 కోట్లు వసూలు చేసినట్లు విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ నివేదిక వెల్లడించింది.

ఇప్పటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా యుద్ధం కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రచారం నిరంతరం కొనసాగుతోంది. ఈ వ్యాధి నుంచి ప్రజలను కాపాడేందుకు బూస్టర్ డోస్‌లు కూడా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే..కరోనా మహమ్మారి సమయంలో ఆంక్షలను అమలు చేయడానికి ఢిల్లీలో క్రిమినల్ చట్టాలను ఎలా ఉపయోగించారో ఒక నివేదిక పేర్కొంది.

2020 మార్చి నుంచి 2022 వరకు 55 వేల మందికి పైగా అరెస్టు చేయగా.. 59 కోట్ల రూపాయలను జరిమానాగా వసూలు చేసినట్టు తేలింది. కరోనా గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు.. ప్రజలు వ్యాధులకు భయపడనందున.. ఢిల్లీ ప్రభుత్వం చట్టాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం వచ్చిందని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ నివేదిక వెల్లడించింది.

23 వేల ఎఫ్‌ఐఆర్‌లు, 55 వేల అరెస్టులు

దేశ రాజధాని ఢిల్లీలో రెండు సంవత్సరాల పాటు కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేశారు. ఈ క్రమంలో కరోనా ఆంక్షలను ఉల్లఘించిన 23,000 మందికి పైగా ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అదే సమయంలో 55,000 మందిని అరెస్టు చేశారు. మార్చి 2020 నుంచి మార్చి 2022 మధ్యకాలంలో ఢిల్లీ పోలీసులు రూ. 59 కోట్ల జరిమానాలను వసూలు చేశారని నివేదిక వెల్లడించింది.

అయితే తప్పనిసరి కోవిడ్ పరిమితులను ఉల్లంఘించినందుకు జిల్లా యంత్రాంగం రూ. 32 కోట్ల జరిమానాలను వసూలు చేసింది. ఢిల్లీలో కోవిడ్-19 నిబంధనల అమలుపై అధ్యయనం ప్రజలకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌లు , కోవిడ్ పరిమితులను అమలు చేయడంలో పోలీసులు , కోర్టులు పోషించే పాత్రను గుర్తించడానికి కోర్టులు జారీ చేసిన ఆదేశాలను మూల్యాంకనం చేస్తుంది. ఢిల్లీలో కోవిడ్ నియంత్రణ చర్యలకు అనుగుణంగా ఉండేలా చట్టాలు ఎలా ఉపయోగించబడుతున్నాయో అర్థం చేసుకోవడం దీని లక్ష్యం.

ఏ నిబంధనల ప్రకారం జరిమానా?

కరోనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై అంటువ్యాధి వ్యాధుల చట్టం 1897, విపత్తు నిర్వహణ చట్టం 2005, IPC క్రింద శిక్షా నిబంధనల ప్రకారం జరిమానా విధించారు. ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ కూడా మహమ్మారిపై ప్రభుత్వ నిర్వహణపై ప్రజల అవగాహన, పరిమితుల ఉల్లంఘనలను గుర్తించడంపై నివేదించడానికి ఒక సర్వేను నిర్వహించింది.

మాస్క్‌లు ధరించని వారే ఎక్కువ 

విధి నివేదిక ప్రకారం.. కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో (రెండేళ్లలో) ఢిల్లీలోని ఏడు జిల్లాల్లో 23,094 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. 54,919 మందిని అరెస్టు చేశారు. ఇందులోని చాలా ఎఫ్‌ఐఆర్‌లు మాస్క్‌లు ధరించని వ్యక్తులపైనే ఉన్నాయి. ఇది కాకుండా.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కేసులలో అనుమతి లేని సామాజిక సమావేశాలు, వ్యాపార కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో తిరగడం వంటివి ఉన్నాయి. ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా అందిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్