చిన్నపిల్లాడిలా మారిన ప్రపంచ కుబేరుడు.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..!

Published : Jun 05, 2023, 11:22 AM IST
చిన్నపిల్లాడిలా మారిన ప్రపంచ కుబేరుడు.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..!

సారాంశం

మంచి రెడ్ కలర్ షేర్వానీ ధరించి, ఆయన నవ్వుతున్నట్లుగా ఉన్న ఫోటో చూస్తే అది మార్ఫింగ్ ఫోటో అని ఎవరూ అనుకోరు. అంత సహజంగా చేశారు. ఈ ఫోటో తనకు బాగా నచ్చింది ఏకంగా ఎలన్ మస్క్ కూడా స్పందించాడు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం  ప్రపంచాన్ని ఏలుతోంది.  ఇప్పుడూ అందరూ దీనినే ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతను కొందరు ప్రశంసిస్తుంటే, దీని వల్ల భవిష్యత్తులో సమస్యలు తప్పవని  మరోవైపు కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, రియల్ గా కనిపించేలా ఫోటోలను రూపొందించే అవకాశం ఉంది.

తాజాగా ప్రపంచ కుబేరుడు , టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మార్ఫిస్తున్నారు.  ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఇటీవల చాలా రకాల ఫొటోలు మార్ఫింగ్​ చేయడం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఎలన్ మస్క్ ని భారతీయ దుస్తుల్లో పెళ్లి కొడుకులా ముస్తాబు చేశారు. మంచి రెడ్ కలర్ షేర్వానీ ధరించి, ఆయన నవ్వుతున్నట్లుగా ఉన్న ఫోటో చూస్తే అది మార్ఫింగ్ ఫోటో అని ఎవరూ అనుకోరు. అంత సహజంగా చేశారు. ఈ ఫోటో తనకు బాగా నచ్చింది ఏకంగా ఎలన్ మస్క్ కూడా స్పందించాడు.

 

కాగా, తాజాగా ఎలన్ మస్క్ చిన్న పిల్లాడు అయితే ఎలా ఉంటాడో మార్ఫ్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నిజంగానే ఆయన చిన్న పిల్లాడిలా మారాడా? లేక ఆయన చిన్నప్పటి ఫోటోనా అన్నట్లుగా ఉంది. చాలా క్యూట్ గా కనిిపస్తున్నాడు. నెటిజన్లు కూడా ఇదే రియాక్షన్ ఇస్తున్నారు. క్యూట్, అడోరబుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?