4 చేతులు, 4 కాళ్లతో పుట్టిన శిశువు.. దేవుడి ప్రతిరూపం అంటూ పసికందును చూసేందుకు ఎగబడ్డ జనం.. ఎక్కడంటే ?

Published : Jun 15, 2023, 11:47 AM IST
4 చేతులు, 4 కాళ్లతో పుట్టిన శిశువు.. దేవుడి ప్రతిరూపం అంటూ పసికందును చూసేందుకు ఎగబడ్డ జనం.. ఎక్కడంటే ?

సారాంశం

నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో ఓ శిశువు జన్మించిన విచిత్ర ఘటన బీహార్ లోని సరన్ జిల్లా చాప్రాలో చోటు చేసుకుంది. అయితే ఆ పాప దైవ రూపం అంటూ స్థానికులు చూసేందుకు తరలివచ్చారు. కాగా ఆ చిన్నారి జన్మించిన 20 నిమిషాలకే కన్నుమూసింది. 

బీహార్ లోని సరన్ జిల్లా చాప్రాలో ఓ మహిళ నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసికందు తల ఆకారం కూడా అసాధారణంగా ఉంది. అసాధారణంగా జన్మించిన శిశువును చూసేందుకు నర్సింగ్ హోమ్ వద్ద పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఆ పసికందును పలువురు దేవుడి ప్రతిరూపం అని భావించగా.. మరొకొందరు దీనిని జీవ అసమానతగా చూశారు. అయితే దురదృష్టవశాత్తూ పాప పుట్టిన కొద్దిసేపటికే కన్నుమూసింది.

ప్రతిపక్షాల ఐక్యత వల్ల 2024 ఎన్నికల్లో ఎలాంటి లాభమూ ఉండదు - గులాం నబీ ఆజాద్

‘న్యూస్ 18’ కథనం ప్రకారం.. సరన్ జిల్లాకు చెందిన ప్రసుతా ప్రియా దేవి చాప్రాలోని శ్యామ్చక్లోని సంజీవని నర్సింగ్ హోమ్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే నవజాత శిశువును చూసి డాక్టర్ కూడా అంతే ఆశ్చర్యపోయాడు. పాప ఇలా జన్మించిన విషయం హాస్పిటల్ లో వేగంగా వ్యాప్తి చెందింది. దీని వల్ల స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. ఆ పాపకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

'తిత్లీ ఉడి' పాడిన గొంతు ఇక లేదు.. ప్రముఖ సింగర్ శారద కన్నుమూత..

ఈ అసాధారణ శిశువు గురించి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ వివరాలు వెల్లడించారు. చిన్నారికి ఒకే తల, నాలుగు చెవులు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, రెండు వెన్నెముకలు ఉన్నాయని చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె ఛాతీలో కొట్టుకునే రెండు గుండెలు ఉన్నాయని తెలిపారు. ఈ శిశువును తల్లి కడుపులో నుంచి బయటకు తీసేందుకు హాస్పిటల్ యాజమాన్యం సిజేరియన్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు జన్మించిన సుమారు 20 నిమిషాల తరువాత ఆ పసికందు చనిపోయింది. అయితే తల్లి ఆరోగ్యంగానే ఉంది. 

ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. గర్భాశయం లోపల ఒకే అండంలో ఇద్దరు పిల్లలు తయారైనప్పుడు ఇలాంటివి సంభవిస్తాయి. కొన్ని కారణాల వల్ల కవలల విభజన ఆలస్యమైతే లేదా అసంపూర్ణంగా ఉంటే ఇలా ప్రత్యేక లక్షణాలతో పిల్లలు జన్మించడానికి దారి తీసే అవకాశం ఉంది. అయితే గర్భిణీ మాత్రం గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ సందర్భంలో ఆపరేషన్ ద్వారా ఆడ శిశువు ప్రసవించినప్పటికీ, దురదృష్టవశాత్తు ఆ పాప తరువాత మరణించింది.

https://telugu.asianetnews.com/international/another-boat-overturned-79-people-drowned-many-drowned-isr-rwa0nz

కొంత కాలం కిందట ఉత్తరప్రదేశ్ లోని షహాబాద్ అనే గ్రామంలో ఓ మహిళ నాలుగు చేతులు, కాళ్లతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు జన్మించిన హర్దోయిలోని షహాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ప్రజలు ఆ చిన్నారిని చూసి ఆశ్చర్యపోయారు. ఆమెను ప్రకృతి ప్రత్యేకమైన సృష్టిగా భావించారు. 
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్