ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి 7 ఏళ్ల బాలుడి మృతి.. ఛార్జ్ చేస్తున్న స‌మ‌యంలో ఘటన

By team teluguFirst Published Oct 3, 2022, 12:18 PM IST
Highlights

ఎలక్ట్రికల్ బైక్ కు ఛార్జింగ్ పెట్టినప్పుడు దాని బ్యాటరీ ఒక్క సారిగా పేలింది. ఈ పేలుడు దాడికి ఓ బాలుడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. 

ఎలక్ట్రిక్ స్కూటర్ బాటరీ పేలడంతో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ముంబై పాల్ఘర్‌లోని వసాయ్ గ్రామానికి చెందిన షానవాజ్ అన్సారీ ఏడాది కింద‌ట రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన బ్యాట్, ఆర్ఈ అనే స్టార్టప్ త‌యారు చేసిన ఇ-స్కూటర్ ను కొనుగోలు చేశాడు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

ఆయ‌న ఎప్ప‌టిలాగే సెప్టెంబ‌ర్ 22వ తేదీన రాత్రి త‌న ఇంట్లో పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక‌ల్ స్కూట‌ర్ కు ఛార్జింగ్ పెట్టాడు. అయితే అది మ‌రుస‌టి రోజు తెల్ల‌వారు జామున 2.30 గంట‌ల‌కు ఒక్క సారిగా పేలింది. ఈ పేలుడు దాటికి సమీపంలోని గ‌దిలో నిద్రిస్తున్న ఏడేళ్ల కుమారుడు షబ్బీర్ అన్సారీకి మంట‌లు అంటుకున్నాయి. బాలుడి శ‌రీరానికి 70 శాతం కాలిన గాయాలు అయ్యాయి.

అక్టోబర్ 11న హైదరాబాద్‌ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకోసమంటే..

ఈ ఘ‌ట‌న సంభవించినప్పుడు బాలుడు, అమ్మమ్మతో క‌లిసి నిద్రిస్తున్నాడు. అమ్మ‌మ్మకు స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. వారిద్ద‌రు హాస్పిట‌ల్ లో చేరి చికిత్స పొందారు. కానీ బాలుడి ప‌రిస్థితి విష‌మించి ఆదివారం మృతి చెందడంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ ప్రమాదానికి కారణం 24Ah లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ అని, వేడెక్కడం వల్లే అది పేలిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

ఢిల్లీలో దారుణం.. శివుడికి న‌ర‌బ‌లి ఇవ్వాలంటూ 6 ఏళ్ల బాలుడి హ‌త్య

కాగా.. ఈ ఏడాది దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలు పేలి, మంట‌లు చెల‌రేగిన ఘ‌ట‌న‌లు అనేకం చోటు చేసుకున్నాయి. కొన్ని నెల‌ల కింద‌ట ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎలక్ట్రిక‌ల్ స్కూట‌ర్ పేలి మంట‌లు అంటుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వాహనంలోని డిటాచబుల్ బ్యాటరీని బెడ్‌రూమ్‌లో ఛార్జింగ్ పెట్టిన‌ప్పుడు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 

click me!