అక్టోబర్ 11న హైదరాబాద్‌ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకోసమంటే..

By Sumanth KanukulaFirst Published Oct 3, 2022, 11:38 AM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11న హైదరాబాద్‌కు రానున్నారు. హెచ్‌ఐసీసీలో జరగనున్న ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (యూఎన్‌డబ్ల్యుజీఐసీ)లో మోదీ పాల్గొననున్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11న హైదరాబాద్‌కు రానున్నారు. హెచ్‌ఐసీసీలో జరగనున్న ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (యూఎన్‌డబ్ల్యుజీఐసీ)లో మోదీ పాల్గొననున్నారు. ఆ వేదికపై నుంచి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సును యూఎన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సదస్సు  ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు కొనసాగనుంది. సదస్సును గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్‌పై నిపుణులు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హోస్ట్ చేస్తారు. దాదాపు 120 దేశాల నుండి 700కు పైగా డెలిగేట్‌లతో సహా 2,000 మంది ప్రతినిధులు హాజరవుతారు.

అయితే అక్టోబర్ 5న కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో.. 11వ తేదీన మోదీ హైదరాబాద్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ.. అధికారిక కార్యక్రమానికి మాత్రమే పరిమితం అవుతారా? బీజేపీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే పార్టీ కార్యక్రమాల్లో కూడా మోదీ పాల్గొనే అవకాశం ఉందని.. రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైన తర్వాత.. ఆయన పాల్గొనే కార్యక్రమాలపై స్పష్టత రానుంది. 

click me!