
ఢిల్లీలో ఓ భవనం అందరూ చూస్తుండగానే ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
గుజరాత్ ప్రజలు అందరి మాట వింటారు.. కానీ నిజాన్నే అంగీకరిస్తారు - ప్రధాని నరేంద్ర మోడీ
అయితే అదృష్టవశాత్తూ ఆ ఇళ్లు ఆ సమయంలో ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. ఆ భవనం కూలిన ప్రదేశంలో ఓ రోడ్డు ఉంది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ కూడా ఎవరూ లేరు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో భవనం కుప్పకూలిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది.
భవనం కూలిన సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ, అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.