
బీహార్ : బీహార్ లో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. చిన్నారులపై.. మైనర్లే అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో 6 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
సరాఫ్రా బజార్‌లో బాధితురాలు తన ఇంటి బయట మిగతా పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నిందితుడు మిగతా పిల్లలను అక్కడినుంచి వెళ్ళగొట్టి.. చిన్నారిని మభ్యబెట్టి తనతో పాటు సమీపంలోని చెరకు తోటలోకి తీసుకువెళ్లాడు.
ఈ సంఘటన గురించి తెలుసుకున్న బాధితురాలి తల్లి వెంటనే చిన్నారిని గోపాల్‌గంజ్ సదర్ ఆసుపత్రికి తీసుకువెళ్లి.. వైద్య చికిత్స చేయించింది. ఆ తరువాత నిందితులపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మణిపూర్‌కు న్యాయం కోసమే అవిశ్వాసం:లోక్‌సభలో చర్చను ప్రారంభించిన గౌరవ్ గోగోయ్
ఇదిలా ఉండగా, నాలుగు రోజుల క్రితం ఇలాంటి అమానుష ఘటనే జార్ఖండ్‌లోని రాంచీలో వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై ఆమె చదువుతున్న స్కూలు ఆవరణలోనే గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఎల్‌కేజీ విద్యార్థిని. ఈ ఘటన వెలుగులోకి రావడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రతుల్ షా డియో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "INDIA పాలిత రాష్ట్రంలో 5 ఏళ్ల చిన్నారిపై దారుణమైన అత్యాచారం చేసిన మరో షాకింగ్ సంఘటన. జార్ఖండ్‌లో సిఎం హేమంత్ సోరెన్ పాలనలో ఇప్పటికి 5 అత్యాచార కేసులు నమోదయ్యాయి. పసిపాపపై దారుణంగా అత్యాచారం చేసిన రాక్షసుడిని తక్షణమే అరెస్టు చేయాలి. సాధ్యమైనంత కఠిన శిక్ష విధించాలి" అని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇలాంటి మరో ఘటనే రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తరువాత ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. 9వ తరగతి చదువుతున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో ముగ్గురు వ్యక్తులపై బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ మేరకు దోవర స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) హేమంత్ చౌహాన్ వివరాలు తెలిపారు.
నిందితుల్లో బాలికకు పరిచయం ఉన్న వ్యక్తి కూడా ఉన్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.ఎఫ్ఐఆర్ ప్రకారం, బుధవారం బాలిక యధావిధిగా పాఠశాలకు బయలుదేరింది. ఆ సమయంలో నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి.. కారులో అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు, అక్కడ వారు ఆమెపై అత్యాచారం చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.