స్కూల్ ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వలేదు.. 9వ తరగతి బాలిక ఆత్మహత్య

Published : Mar 04, 2023, 01:18 PM IST
స్కూల్ ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వలేదు.. 9వ తరగతి బాలిక ఆత్మహత్య

సారాంశం

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 9వ తరగతి బాలికను ఫీజు కట్టలేదని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పరీక్ష రాయనివ్వలేదు. దీంతో వెనుదిరిగిన ఆ బాలిక ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది.  

లక్నో: స్కూల్ ఫీజు కట్టలేదని 9వ తరగతి బాలికను స్కూల్ యాజమాన్యం పరీక్ష రాయనివ్వలేదు. కొంత సమయం ఇస్తే ఆ ఫీజు కట్టేస్తామని బాలిక తల్లిదండ్రులు ప్రాధేయపడినా ఆ స్కూల్ యాజమాన్యం వినిపించుకోలేదు. ఆమెను పరీక్ష రాయడానికి అనుమతించలేదు. దీంతో ఇంటికి వచ్చిన 14 ఏళ్ల బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.

బరదారి నివాసి అశోక్ కుమార్‌ 14 ఏళ్ల కూతురు 9వ తరగతి చదువుతున్నది. ఓ స్థానిక ప్రైవేటు స్కూల్‌లో చదివించాడు. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా స్కూల్ ఫీజును తాను డిపాజిట్ చేయలేకపోయాడని అశోక్ కుమార్ తెలిపాడు. ఆ ఫీజు చెల్లించడానికి కొంత సమయం ఇవ్వాలని తాను స్కూల్ యాజమాన్యాన్ని కోరినట్టు వివరించాడు. కానీ, శుక్రవారం జరిగిన పరీక్షకు తన కూతురిని హాజరు కానివ్వలేదని ఆరోపించాడు. పోలీసులను ఆశ్రయించి ఈ ఫిర్యాదు చేశాడు. తనను పరీక్ష రాయనివ్వకపోవడంతో ఆ బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Also Read: కేశవరెడ్డి స్కూల్‌లో చదువుతున్న విద్యార్థి మృతి.. టీచర్ కొట్టడం వల్లే జరిగిందని తల్లిదండ్రుల ఫిర్యాదు..

కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ రాహుల్ భాటి కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?