95 శాతం మంది ముస్లింలు భారతీయులైనందుకు గర్వపడుతున్నారు : ప్యూ సర్వే

By team teluguFirst Published Jul 3, 2021, 3:32 PM IST
Highlights

భారతదేశంలో రెండవ అతిపెద్ద మతమైన ముస్లింలలో 95 శాతం మంది భారతీయులమైనందుకు గర్విస్తున్నట్టు పేర్కొన్నారు. 

భారతదేశంలో అన్ని మతాల ప్రజలు తమ మతాన్ని, ఆచారాలను స్వేచ్ఛగా పాటించగలుగుతున్నారని తాజా ప్యూ రీసెర్చ్ సర్వేలో బయటపడింది. 2019 చివరి నుండి 2020 తొలినాళ్లలో నిర్వహించిన ఈ సర్వేలో దదాపు 30 వేల మంది ప్రజలు పాల్గొన్నారు. వీరిలో 84 శాతం మంది నిజమైన భారతీయతకు పరమత సహనం అనేది చిహ్నమని పేర్కొన్నారు. మరో 80 శాతం మంది వేరే మతాన్ని గౌరవించడం అనేది వారి మతంలో అంతర్భాగమని అభిప్రాయపడ్డారు. 

91 శాతం మంది తాము, ఇతర మతస్థులు కూడా వారివారి మతాలను స్వేచ్ఛగా ఆచరించగలుగుతున్నట్టు తెలిపారు. భారతదేశంలో ఉన్న ప్రధానమైన ఆరు మతాలకు చెందినవారు తమ మిత్రుల్లో అత్యధికులు తమ మతానికి చెందిన వారే అని తెలిపినట్టు ఈ సర్వే పేర్కొంది. 

భారతదేశంలో రెండవ అతిపెద్ద మతమైన ముస్లింలలో 95 శాతం మంది భారతీయులమైనందుకు గర్విస్తున్నట్టు పేర్కొన్నారు. భారతదేశంలో హిందువులకు ముస్లింలకు మధ్య సంబంధాలకు కంప్లికేటెడ్ చరిత్ర ఉన్నప్పటికీ... ప్రజలంతా భారతీయ సంస్కృతి మిగిలిన సంస్కృతాలకన్నా గొప్పదని బలంగా విశ్వసిస్తున్నారు. భారతీయులంతా పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు కానీ... భారతీయ సంస్క్రుతిమాత్రం అత్యున్నతమైనదని వారు అభిప్రాయపడ్డారు. 

ఈ సర్వేలో 24 శాతం మంది ముస్లింలు తాము వివక్షకు గురవుతున్నామని పేర్కొనగా 21 శాతం మంది హిందువులు తాము వివక్షకు గురవుతున్నట్టు పేర్కొన్నారు. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ డాటాలో గణనీయమైన మార్పులు కనిపించాయి. ఉత్తరాదిలో 40 శాతం మంది తాము వివక్షకు గురవుతున్నామని చెప్పగా... దక్షిణాదికొచ్చేసరికి అది 19 శాతంగా ఉంది. ఈశాన్య భారతంలో 19 శాతం మంది వివక్షను ఎదుర్కొంటున్నట్టు చెప్పగా... మధ్య భారతదేశంలో 17 మంది వివక్షను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. తూర్పు భారతదేశంలో 17 శాతం మంది, పశ్చిమ భారతదేశంలో 15 శాతం మంది వివక్షను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. 

74 శాతం మంది ముస్లింలు తమకు ఇస్లామిక్ కోర్టులతోపాటుగా జ్యూడిషల్ కోర్టులకు కూడా యాక్సిస్ ఉందని పేర్కొన్నారు. ఇస్లామిక్ కోర్టు తీర్పులు చట్టబద్ధం కాకున్నప్పటికీ... వాటిని ఇతర మతస్థులు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేక కోర్టుల పట్ల ముస్లింలు ఒకింత సానుకూలంగా ఉన్నప్పటికీ... పరమత సహనానికి మాత్రం పెద్ద పీట వేస్తున్నారు. భారతదేశంలోని భిన్నంత్వం దేశానికి అత్యవసరమని పేర్కొన్నారు. 

ప్రత్యేక రిలీజియస్ ఇస్లామిక్ కోర్ట్స్ ను పలువురు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు. దేశంలోని అందరూ సమానులే అయినప్పుడు ముస్లింలకు మాత్రం ప్రత్యేక కోర్టులెందుకని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కోర్టుల వల్ల మహిళలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మరికొందరు పేర్కొంటున్నారు. 

మరోవైపు ముస్లిం మత పెద్దలు మాత్రం ఇలాంటి కోర్టులను సమర్థిస్తున్నారు. ఈ కోర్టుల్లో అత్యధిక శాతం కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ఒకవేళ ఈ కోర్టులే పనిచేయకపోతే భారతీయ న్యాయ వ్యవస్థను ఈ చిన్న కేసులు భారం చేయగలవాని, ఈ సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది కాబట్టి కోర్టులు ఇతర ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడాం వీలవుతుందని వీరు పేర్కొంటున్నారు. 

click me!