వికలాంగులకు ఇండియా మొత్తంలో 94 లక్షల ఐడీ కార్డులు.. బెంగాల్‌లో 9 మాత్రమే , ఎందుకిలా ..?

Siva Kodati |  
Published : Jun 06, 2023, 09:40 PM IST
వికలాంగులకు ఇండియా మొత్తంలో 94 లక్షల ఐడీ కార్డులు.. బెంగాల్‌లో 9 మాత్రమే , ఎందుకిలా ..?

సారాంశం

భారత్‌లో జారీ చేయబడిన మొత్తం 94 లక్షల ప్రత్యేక వికలాంగ గుర్తింపు కార్డులలో కేవలం తొమ్మిది మాత్రమే పశ్చిమ బెంగాల్‌కు చెందినవిగా తెలుస్తోంది

అధికారిక డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా జారీ చేయబడిన మొత్తం 94 లక్షల ప్రత్యేక వికలాంగ గుర్తింపు కార్డులలో కేవలం తొమ్మిది మాత్రమే పశ్చిమ బెంగాల్‌కు చెందినవిగా తెలుస్తోంది. ప్రత్యేకమైన వికలాంగ గుర్తింపు కార్డు (యూడీఐడీ) అనేది వికలాంగులకు వివిధ పథకాల ప్రయోజనాలను పొందేందుకు సహాయపడే కార్డ్. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పంచుకున్న వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ని 716 జిల్లాల్లో 94.30 లక్షల ఈ - యూడీఐడీ కార్డ్‌లు ‌రూపొందించారు. అయితే వీటిలో పశ్చిమ బెంగాల్ నుంచి కేవలం 9 మాత్రమే జారీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. కార్డ్‌ల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని చెప్పారు. 25 నుంచి 50 అతి ముఖ్యమైన ప్రభుత్వ భవనాలకు యాక్సెసిబిలిటీ ఆడిట్ నిర్వహించామని వీరేంద్ర సింగ్ తెలిపారు. 50 నగరాల్లో వాటిని పూర్తిగా అందుబాటులో వుండేలా మార్చే లక్ష్యంతో 1671 భవనాలకు యాక్సెస్ ఆడిట్ చేశామని.. ఇందులో రూ.1313 కోట్లకు గాను రూ.562.09 కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు