
భారత ముస్లింల జనాభాలో అష్రఫ్‌లు పది శాతం. ఈ పది శాతమే 90 శాతం ఉన్న పాస్మంద ముస్లింలపై అధికారం చెలాయిస్తారు. 90 శాతమున్న పాస్మంద ముస్లింలు ఎవరికి ఓటు వేయాలో ఆ పది శాతం అష్రఫ్‌లే నిర్ణయిస్తారు. మైనార్టీల స్కీమ్‌లన్నీ అష్రఫ్‌లే లబ్దిపొందుతారు. జనరల్ పబ్లిక్‌కు పథకాలకు పాస్మంద ముస్లింలను వదిలిపెడతారు.
ఉత్తరప్రదేశ్‌లోని పాస్మంద ముస్లింల నేత, రచయిత డాక్టర్ ఫయాజ్ అహ్మద్ ఫైజీ అభిప్రాయం ఇది. ఆవాజ్ ది వాయిస్, హిందీ, ఎడిటర్ మాలిక్ అస్ఘర్ హష్మి ఆయనను ఇంటర్వ్యూ చేయగా కీలక విషయాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా పాస్మంద ముస్లింలు ఎందుకు ఉద్యమం చేయాల్సి వచ్చిందో వివరించారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన కీలక విషయాలు ఇలా ఉన్నాయి.
పాస్మంద ముస్లింలు అంటే ఎవరు?
ముస్లింలలో భావజాలం, మతం ఆధారంగా రెండు వర్గాలు ఉన్నాయి. షియాలు, సున్నీలు. కులం, తెగ ఆధారంగా పాస్మంద, అష్రఫ్ అనే వర్గాలు ఉన్నాయి. పాస్మంద అంటే విధికి విడిచిపెట్టినవారని అర్థం. నేడు ఈ సమీకరణాలపై మన దేశంలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. కుల వ్యవస్థ, వివక్ష కారణంగా వెనుకబడిన ముస్లింల అభ్యున్నతే తమ ఉద్యమ లక్ష్యం.
కొన్ని కారణాల చేత వేర్వేరు కులాలు ఉన్నాయి. ఇస్లాంను స్వీకరించిన ఓబీసీలను పాస్మంద అంటారు.
ఇది చాలా పెద్ద పదాలు. సరిగా అర్థం కావు. సింపుల్‌గా పాస్మంద, అష్రఫ్ ముస్లింలు అంటే ఎవరో వివరించండి?
అష్రఫ్‌లు అంటే బయటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ పాలకులుగా ఉన్నవారు. నేడు కూడా ఆ వర్గం వారే పాలకవర్గంలో ఉన్నారు. సయ్యద్, ముఘల్, పఠాన్ మున్నగు ఇంటిపేర్లవాు బయటివారే. మిగిలిన కుమ్మరి, నేత, జాలర్లు, మిరాసీలు, నాట్, భగత్‌లు స్థానికులు. వీరికి సాధారణ ఇంటి పేర్లు ఉంటాయి. హిందు కులమూ ఉంటుంది. వీరిని పాస్మంద కేటగిరీలో చేర్చారు.
చరిత్రను చూస్తే పాస్మంద వర్గం ఎన్నడూ పాలించలేదు. అష్రఫ్ కులం స్వయంగా వారిని వారు విదేశీయులని చెప్పుకుంటారు. షేర్వాని, కిర్మాని మొదలైన ఇంటిపేర్లు వారికి ఉంటాయి. ప్రపంచంలోని పలు నగరాలతోనూ వారి మూలాలు ఉంటాయి. ఉదాహరణకు సయ్యద్‌లు అరబ్, ఇరాన్‌ల నుంచి వచ్చినవారు. వారిని వారు ఖులాఫా ఈ రషీదిన్ లేదా అరబ్ జాతి అని చెప్పుకుంటారు. కొన్నిసార్లు ఈ ఇంటిపేర్లు కూడా గందరగోళంగా ఉంటాయి. ఉదాహరణకు ఖురేషి ఇంటి పేరును పాస్మంద, అష్రఫ్‌లు ఉపయోగిస్తారు. అన్సారీలంటే పాస్మంద వర్గం అని కూడా అనుకుంటారు. కానీ, బీజేపీ నేత ముక్తార్ అన్సారీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలు పాస్మందలు కారు.
కొన్నిసార్లు పాస్మంద వర్గాలు అరబ్ పేర్లనూ ఉపయోగిస్తుంటారు. ఇరాన్, అఫ్గనిస్తాన్, అరేబియా నుంచి వచ్చిన పాలక వర్గమే అష్రఫ్. అష్రఫ్ అంటే అరబ్‌లో కులీనుడని అర్థం. అదే అజ్లాఫ్ అంటే నిమ్న అని అర్థం. సమాజంలో అట్టడుగు వర్గాలను అర్జల్ అని పిలుస్తారు. అజ్లఫ్, అర్జల్స్ అని భారత ముస్లింలను పిలుస్తారు.
పాస్మంద వర్గీయులు అంటే మేం స్థానికులం. మేంస్థానిక సంస్కృతిని అనుసరిస్తాం. మా సంస్కృతి హిందువులకు సన్నిహితంగా ఉంటుంది. పెళ్లి తంతులోనూ అనేక కార్యక్రమాలు పాటిస్తాం. అందుకే మమ్మల్ని నిమ్న వర్గాలుగా చూస్తారు. హిందువులను పోలిన సంస్కృతిని వదిలిపెట్టాలని వారు చెబుతుంటారు. ముస్లిమేతర సంస్కృతిని నిర్మూలించాల్సి ఉన్నదని ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టంగా చెప్పింది. అంటే.. వారు మా నుంచి భారత సంస్కృతిని తొలగించాలని చూస్తున్నారు. వేడుకల్లో తమ(పాస్మంద) మహిళలు నుదుట తిలకం, కాలి వేల్లకు రింగ్‌లు, చీర కట్టు పాటిస్తారు. లెహెంగా సూట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. మైథిలి, భోజ్‌పురి, అవధి, బజ్రా, తెలుగు, బెంగాలి,గుజరాతీ భాషలనూ వారు మాట్లాడుతారు.
స్వాతంత్ర్యం తర్వాత పాస్మంద ముస్లింలు వృద్ధి చెందారా?
నేను విద్యారంగం నుంచి మొదలు పెడతా. సాచర్ కమిటీ చాప్టర్ 10 ఈ విషయాన్ని స్పష్టంగా చర్చించింది. పాస్మంద వర్గాల్లో అక్షరాస్యత స్వాతంత్ర్యం తర్వాతే పెరిగింది. ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయని కాదు, కానీ, మొత్తంగా కొంత మెరుగుదల ఉన్నది. భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితులు కొంత మెరుగయ్యాయి.
మాజీ ఎంపీ అష్ఫఖ్ ముస్సేన్ అన్సారీ ఓ అద్యయనం చేశారు. 14వ లోక్‌సభ వరకు 400 ఎంపీల్లో 340 ఉన్నత వర్గాల నుంచి 60 నుంచి 40 ఎంపీలు మా పాస్మంద వర్గం నుంచి గెలిచారు.
ముస్లిం పాలకుల సమయంలోనూ పాస్మంద వర్గం దయనీయంగా బతికింది. అక్బర్ వంటి చక్రవర్తి కూడా పాస్మందలకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చారు.
దేశంలో మైనార్టీ అంటే ముస్లింలనే నేను నమ్ముతా. ఇక్కడ ముస్లింలంటే అష్రఫ్‌లు అనేలా మారిపోయింది. కొన్ని రోజుల క్రితం నేను ఒక టీవీ చానెల్‌లో డిబేట్ చూశాను. ప్యానెలిస్టులు అంతా అష్రఫ్‌లే. ఆ పది శాతం వర్గానికి చెందిన అష్రఫ్ వర్గీయులే 90 శాతమున్న పాస్మంద వర్గాలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తున్నారు. అష్రఫ్‌లే మైనార్టీల ప్రయోజనాలను అందిపుచ్చుకుంటున్నారు. మా వర్గానికి బలమైన గళం లేకపోయింది. 90 శాతం భారత ముస్లింలకు (పాస్మందలు) బీహెచ్‌యూలో అడ్మిషన్ సులభంగా లభిస్తుంది. కానీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో లభించదు. అందుకే నేను ముస్లిం లేదా మైనార్టీ సమస్యలపై సంప్రదింపులు, సంవాదాలను వ్యతిరేకిస్తాను. అవి మాకు అధిక హానిని తలపెడుతున్నాయి.
మీ సమాధానంలో చాలా అంశాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు ఏ లక్ష్యాల కోసం పోరాడుతున్నారు?
విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు ఇప్పటికీ తమను తాము విదేశీయులనే పిలుచుకుంటున్నారు. దళిత సంఘాలు బ్రాహ్మణులను బయటి వారు అంటున్నప్పుడు వారు తాము ఈ గడ్డ మీదే జన్మించామని సమాధానం ఇస్తారు. కానీ, అష్రఫ్‌లు అలా కదు.. వారు మాట్లాడే ప్రతి వాక్యంలో జాతి, నగరం వంటి వాటిని వల్లెవేస్తారు. ఆ జాతి, ఆ నగరం కూడా తప్పకుండా మన దేశానికి చెందినదై ఉండదు. ఇరానియర్, అరబిక్ సంస్కృతి శ్రేష్టమైనదని, ఉత్కృష్టమైనదని వాదిస్తుంటారు. చూడండి.. మీది హిందు సంస్కృతి వంటిది అని నిందిస్తుంటారు. పాస్మంద వర్గాలకు ఉర్దులో ప్రావిణ్యం లేదని ఎగతాళి చేస్తుంటారు. బాల్యం నుంచే మేం ఇలాంటి చీదరింపులు ఎదుర్కొంటున్నాం. ఇక మరో వివక్ష.. వారు అరబ్‌లని, ఇరానియనలు అని పిలుచుకుంటారు. మమ్మల్ని అజ్మిలంటారు. అజ్మి అంటే గూండా. ఈ మూడు వివక్షలకు వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం. ఈ కుల, జాతి వివక్ష నుంచి సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాం.
Also Read: యూట్యూబ్‌లో నకిలీ ముల్లాల బోధనలు ప్రమాదకరం.. ఊహా ప్రపంచంతో వాస్తవ సమస్యలు పరిష్కృతమవుతాయా?
పాస్మందలను వారి మాతృ భాష గురించి అడగండి.. భోజ్‌పురి, మైథిలి, తెలుగు మాట్లాడేవారు కూడా ఉర్దూ అని చెబుతారు. ఇంటికి వెళ్లాక మల్లీ తెలుగు, భోజ్‌పురి, మైథిలి భాషల్లోనే మాట్లాడుకుంటారు. ఈ సంస్కృతికి వ్యతిరేకంగా పని చేస్తున్నాం. మా తల్లులు చీర కట్టుకుంటే గర్వపడాలి. అంతేకానీ, ఇరానీ డ్రెస్సైన జుబ్బా ధరించాలని ఒత్తిడి చేయవద్దు. మాపై ఎవరు ఇలాంటి ఒత్తిడి చేయవద్దు. ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇతర అన్ని ముస్లిం సంస్థలు కేవలం ఆ విదేశీ ముస్లింల కోసమే పని చేస్తున్నాయి. ఉదాహరణకు ముస్లిం పర్సనల్ లా బోర్డులో 1500 నుంచి 200 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఒక్క భారత ముస్లిం కూడా సభ్యుడై లేడు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం.
మీరు చాలా తీవ్రమైన విషయాలు లేవనెత్తారు. ఈ విషయాలపై పాస్మంద ముస్లింలు ఎందుకు ఏకం కావడం లేదు?
అష్రఫ్‌ల అధికారం ముందు మేం మూగబోయాం. ప్రపంచంలో యూదులు శక్తివంతులని భావిస్తారు. కానీ, కాదు అష్రఫ్‌లే పవర్‌ఫుల్. ముఖ్యంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ మరింత శక్తివంతమైనది. ప్రపంచవ్యాప్తంగా వారు పాకి ఉన్నారు. ఇస్లంాలోన కులం ఉన్నది.
సర్దార్ పటేల్ మాత్రమే పాస్మంద వర్గాల బలాన్ని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత వారి బలాన్ని ఎవరూ ఉపయోగించుకోలేదు. మండల్ కమిషన్ డిబేట్ సమయంలోనూ మహారాష్ట్ర నుంచి షబ్బీర్ అన్సారీ ఎదిగాడు. మీడియా కవరేజ్ ఇచ్చింది. బిహార్ నుంచి ఎజాజ్ అలీ దేశంలోనే ఉత్తమమైన సర్జన్‌గా వెలిగాడు. పాస్మంద వర్గం ఎల్లప్పుడూ అష్రఫ్‌లను ప్రతిఘటించింది. కానీ, మీడియా మమ్మల్ని విస్మరించింది. అది అష్రఫ్‌లకే కవరేజ్ ఇచ్చింది.
ఇప్పటికీ మీడియా ఈ డిబేట్‌లను ముగించలేదు. ఇప్పటికీ మీరు టీవీల్లో ఓవైసీలను చూడొచ్చు. వారి ప్రకటనలపై చర్చ చేస్తుంటాయి. ఈ చర్చల్లో 90 శాతం మంది ముస్లింల అభిప్రాయాలను చర్చించరు. వాటికి ముస్లింలు అంటే అష్రఫ్‌లే. సల్మాన్ ఖఉర్షీద్, జావేద్ అక్తర్ వంటి వారినే మీడియా పరిగణనలోకి తీసుకుంటుంది. ఎందుకంటే.. ఎక్కడ చూసినా అష్రఫ్‌లే ఉన్నారు కాబట్టి.
ములాయం సింగ్, కాన్షీ రామ్ పాస్మంద ముస్లింలపై సానుకూలంగా వ్యవహరించారు. కాన్షీరాం ముక్తార్ అన్సారీ వంటి పాస్మంద వర్గీయునికి మంత్రి పదవి ఇచ్చారు.
సామాజిక కోణంలో చూస్తే హిందు సమాజంలోనే కాదు.. ముస్లిం సమాజంలోనూ దళితులు, వెనుకబడివారు ఉన్నారు. కాన్షీరాం ఆయన ప్రణాళికలను మరింత ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అది వేరే విషయం.
నూర్ మొహమ్మద్ సాహెబ్ పూర్నియా జిల్లా వాస్తవ్యుడు. 1948లో మాకు ముస్లిం పేరుతో ఏ పార్టీ అవసరం లేదని అన్నాడు. అందుకే మేం ముస్లిం భావధారకు వ్యతిరేకం. ఆయన 1937లో బిహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యాడు. మేం ముందు నుంచే ముస్లిం ఆలోచనలకు దూరంగా ఉన్నాం. ముస్లింలు మత ఉన్మాదానికి వ్యతిరేకం. మా గళం బలహీనంగా ఉండొచ్చు.. మా అడుగులు చిన్నవే కావొచ్చు.. కానీ, మా పట్టుదల, ఆలోచనలు, ధైర్యం అసమానమైనది.
---- మాలిక్ అస్ఘర్ హష్మి