రీల్స్ పిచ్చి.. చదువుకొమ్మని తండ్రి మందలింపు.. మనస్తాపంతో తొమ్మిదేళ్ల బాలిక ఆత్మహత్య...

By SumaBala BukkaFirst Published Mar 29, 2023, 9:02 PM IST
Highlights

చదువుకోకుండా రీల్స్ చేస్తుందని తండ్రి కొప్పడడంతో ఓ తొమ్మిదేళ్ల చిన్నారి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది. 

తమిళనాడు : నేటి కాలంలో రీల్స్ చేయడం చిన్నా, పెద్దా అందరికీ ఓ అలవాటుగా మారిపోయింది. అలవాటు అనేకంటే అడిక్షన్ అనడం కరెక్టేమో. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రీల్స్ పిచ్చితో ఓ  తొమ్మిదేళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోని తిరువళ్లువార్ కు చెందిన ప్రతిషా అనే అమ్మాయి  సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండేది. ప్రతిషా వయసు 9 సంవత్సరాలు. ఆ వయసులో చదువుకోకుండా రీల్స్ చేయడం సరికాదని తండ్రి ఆమెను మందలించాడు. చదువు మీద దృష్టి సారించాలని గట్టిగా చెప్పాడు. దీంతో చిన్నారి తీవ్ర మనస్థాపానికి గురైంది.

ఇంట్లో నుంచి తండ్రి బయటికి వెళ్ళగానే గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకుంది. ఇది గమనించిన ఇంట్లోని మిగతా కుటుంబ సభ్యులు వెంటనే ప్రతీషాను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆ చిన్నారిని పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా నిర్ధారించారు.  అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది. చదువుకోమని తండ్రి చెప్పడమే తప్పుగా మారింది.  ఈ విషాద ఘటన స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిమీద పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

అమృత్ పాల్ సింగ్ పరారీలోనే ఉన్నాడు.. విదేశాల నుంచి వీడియో విడుదల...

ఇదిలా ఉండగా, ఈ నెల 20న ఇలాంటి విచిత్రమైన విషాద ఘటన ఒకటి ఏపీలో వెలుగు చూసింది. మహిళల మీద జరుగుతున్న దాష్టీకాలకు ఇదో పరాకాష్ట.  ప్రేమించినంత మాత్రాన తాము చెప్పినట్టే వినాలని.. పొసెసివ్ గా ఉండే  పురుషుల మనస్తత్వానికి అద్దం పట్టే ఘటన. ప్రియురాలు బైక్ మీద తిరగడానికి జీర్ణించుకోలేకపోయిన ఓ ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆశ్చర్యంగా అనిపించే ఈ ఘటన కృష్ణాజిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. ప్రియురాలు తన కళ్ళ ఎదుటే టు వీలర్ నడపడాన్ని సదరు ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. తనకు అలా తిరగడం ఇష్టం లేదని ఆమెని వారించాడు. కానీ, ఆమె వినలేదు. 

దీంతో మనస్థాపం చెందిన ప్రియుడు ఆమె ఇంటి వద్దకు వెళ్లి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బవర్ సింగ్ అనే వ్యక్తి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని మార్వాడి గుడి సమీపంలో ఉంటాడు. గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ బయట టీ షాప్ ఉంది. బవర్ సింగ్ రెండో కొడుకు శైలేష్ సింగ్ (26). అతను అదే పట్టణానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇటీవల ఆమె ద్విచక్ర వాహనం కొనుక్కుంది. ఆ బండి మీద ఆమె పట్టణంలో తిరగడం శైలేష్ సింగ్ కి నచ్చలేదు. ఈ విషయాన్ని శైలేష్ సింగ్..  ఆ యువతికి చెప్పాడు. కానీ ఆమె వినలేదు. దీంతో శైలేష్ సింగ్  తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. 

ఆదివారం సాయంత్రం తన ప్రియురాలు ఇంటి దగ్గరికి వెళ్ళాడు.  నువ్విలా టు వీలర్ మీద ఊరికే అటు, ఇటు తిరుగుతుంటే నేను తట్టుకోలేను.. చనిపోతానని ఆమెను బెదిరించాడు. దీంతో చిరాకు వచ్చిన ఆమె నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని బదిలిచ్చింది. శైలేష్ సింగ్ మనస్థాపానికి గురయ్యాడు. అక్కడి నుంచి నేరుగా ప్రియురాలు ఇంటి మీద నివసిస్తున్న వారి ఇంటికి వెళ్ళాడు.  అక్కడ ఒంటిపై  పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడి మంటలు ఆర్పి.. 108 సహాయంతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే దాదాపు 90% పైగా శరీరం కాలిపోయి ఉండడంతో శైలజ సింగ్ పరిస్థితి విషమించింది.  దీంతో న్యాయమూర్తి అతని మరణ వాంగ్మూలాన్ని సేకరించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం శైలేష్ సింగ్ ను  మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. 

click me!