ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు బాలికల కిడ్నాప్.. తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య..

By Bukka SumabalaFirst Published Aug 20, 2022, 9:44 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారుల్ని కిడ్నాప్ చేశాడు. వారిలో ఓ బాలిక మీద అత్యాచారం చేసి, హత్య చేశాడు. 

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆరు, తొమ్మిది సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలు కిడ్నాప్ అయ్యారు. వారిని ఒక యువకుడు అపహరించాడు. ఆ ఇద్దరు బాలికల్లో ఒకరిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు. తొమ్మిదేళ్ల బాలిక బట్టలపై రక్తపు మరకలతో పొలంలో శవమై కనిపించింది. ఇంకో బాలిక ఎలాగోలా తప్పించుకుంది. అని పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) మునిరాజ్ జి మాట్లాడుతూ బాలికల గ్రామంలోనే నిందితుడు ఉంటాడు.

ఆ యువకుడు గురువారం బాలికలిద్దరినీ సైకిల్‌పై సవారీకి తీసుకెళ్లాడు. ఆతరువాత వారు కనిపించకుండా పోయారు. బాలికలిద్దరూ బంధువులవుతారు. వారు కనిపించకుండా పోయారని కుటుంబసభ్యులు గుర్తించి.. వెంటనే పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీసులు వారి కోసం వెతకడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం పొలంలో తొమ్మిదేళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలిక దుస్తుల మీద రక్తపు మరకలు ఉన్నాయని, నిందితుడు నేరం అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు.

శ్రీకృష్ణజన్మాష్టమి 2022 : మధుర ఆలయంలో అర్థరాత్రి భక్తుల రద్దీ, ఊపిరాడక ఇద్దరు మృతి

ఇదిలా ఉండగా, రక్షాబందన్ రోజు బీహార్ లో దారుణ ఘటన జరిగింది. ఇది  కాస్త ఆలస్యంగా ఆగస్ట్ 15న వెలుగులోకి వచ్చింది. బీహార్ లో దారుణం జరిగింది. బీహార్‌లోని సివాన్‌లో ఓ మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అన్నకు రాఖీ కట్టడం కోసం బాలిక తన సోదరుడి ఇంటికి వెళ్తుండగా ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ దారుణానికి సంబంధించిన నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేయకపోవడంతో ఈ సంఘటన స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాచారం ప్రకారం, బాలిక తన సోదరుడికి రాఖీ కట్టేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడ నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అటుగా కారులో వెడుతున్న ఓ వ్యక్తి ఆమె అరుపులు విని.. నేరం జరిగిన ప్రదేశానికి చేరుకునేసరికి నిందితులు పారిపోయాడు.

డ్రైవర్ బాలికకు సహాయం చేసి ఆమెను ఆసుపత్రిలో చేర్చాడు, అక్కడ ఆమెకు చికిత్స జరుగుతోంది. ఈ ఘటనలో బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. భగవాన్ పూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ పంకజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు బాలికకు వైద్యం అందించారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు పవన్ కుమార్, అంకిత్ కుమార్, ఇమాముద్దీన్, దినేష్ కుమార్‌లపై శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బాధితురాలు తన మేనమామ ఇంట్లో నివసిస్తోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురై తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. గ్రామంలో పరిస్థితులు సరిగా లేవని గ్రామస్తులు తెలిపారు. మద్యపాన నిషేధం తర్వాత యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!