అమానుషం : శ్మశానంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని కాల్చి...

By AN TeluguFirst Published Aug 3, 2021, 10:56 AM IST
Highlights

ఆ చిన్నారి కూలర్ నీళ్లు తాగుతుండగా కరెంట్ షాక్ కొట్టిందని వాళ్లు తల్లికి చెప్పారు. అయితే చిన్నారి మణికట్టు, మోచేయిపై కాలిన గుర్తులు ఉన్నాయి. ఆమె పెదవులు కూడా నీలం రంగులో ఉన్నాయని ఆమె తల్లి చెబుతోంది.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని బలవంతంగా కాల్చేశారు. ఈ కేసులో ఓ పూజారితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంో తమకు న్యాయం చేయాలంటూ స్థానికులు ఆ నిరసన చేపట్టారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన ఆ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని పురానా నంగల్‌ శ్మశానవాటికకు సమీపంలో నివసిస్తోంది.

నిన్న సాయంత్రం శ్మశానవాటిక లోని కూలర్ నుంచి మంచినీళ్లు తీసుకురావడానికి శ్మశానవాటికకు వెళ్లింది.. కానీ తిరిగి రాలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో, శ్మశానవాటిక పూజారి రాధేశ్యామ్ కు తెలిసిన కొందరు స్థానికులు.. చిన్నారి తల్లిని శ్మశానవాటికకు పిలిచారు. అక్కడ ఆ చిన్నారి మృతదేహాన్ని చూపించారు.

ఆ చిన్నారి కూలర్ నీళ్లు తాగుతుండగా కరెంట్ షాక్ కొట్టిందని వాళ్లు తల్లికి చెప్పారు. అయితే చిన్నారి మణికట్టు, మోచేయిపై కాలిన గుర్తులు ఉన్నాయి. ఆమె పెదవులు కూడా నీలం రంగులో ఉన్నాయని ఆమె తల్లి చెబుతోంది.

పూజారి, అతని సహచరులు ఈ విషయం మీద పోలీసులకు సమాచారం ఇవ్వవద్దని బాలిక తల్లికి చెప్పారు. కేసు నమోదు చేస్తే పోస్ట్‌మార్టం పేరుతో పిల్లల అవయవాలు చోరీ చేస్తారని వారు ఆమె తల్లిని భయపెట్టారు. అంతేకాదు వెంటనే అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు.

దీనికి తల్లి ఒప్పుకోవడంతో వారు విజయం సాధించారు. అయితే తల్లికి కొంత  డబ్బులు కూడా ఇచ్చి ఉంటారని స్థానికంగా ఊహాగానాలు వెలువడ్డాయి. అనుమానం వచ్చిన తల్లి.. తన భర్తతో కలిసి ఈ ఘటన మీద యుద్ధానికి తెరలేపింది. పాత నంగల్ గ్రామానికి చెందిన సుమారు 200 మంది  శ్మశానవాటిక వద్ద గుమిగూడారు. పోలీసులకు సమాచారం అందించారు.

నైట్ వెస్ట్ జిల్లా పోలీసు సీనియర్ అధికారి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తమకు ఈ కేసు గురించి కాల్ వచ్చిందని చెప్పారు. నిందితుల మీద పిల్లల లైంగిక వేధింపులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలపై నేరాలపై కఠినమైన చట్టాల కింద అభియోగాలు నమోదు చేయబడ్డాయని తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు. 

click me!