మ‌హారాష్ట్రలో విషాదం.. నీట మునిగి 9 మంది మృతి.. మృతుల్లో న‌లుగురు టెన్త్ విద్యార్థులు..

Published : May 20, 2022, 01:17 PM IST
మ‌హారాష్ట్రలో విషాదం.. నీట మునిగి 9 మంది మృతి.. మృతుల్లో న‌లుగురు టెన్త్ విద్యార్థులు..

సారాంశం

మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు రెండు ప్రాంతాల్లో 9 మంది ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి చనిపోయారు. ఈ రెండు ప్రమాదాలు పూణే జిల్లాలోనే చోటు చేసున్నాయి. అయితే ఇందులో మృతులంతా పాతికేళ్లలోపే కావడం విచారకరం. 

మహారాష్ట్రలోని పూణేలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నీట మునిగి తొమ్మిది మంది మృతి చెందారు. మొద‌టి ఘ‌ట‌న భోర్ తహసీల్ లోని భత్ ఘర్ డ్యామ్ బ్యాక్ వాటర్ లో జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మహిళలు చ‌నిపోయారు. ఖేడ్ తహసీల్ లోని చసక్ మన్ రిజర్వాయర్ లో జ‌రిగిన మ‌రో ఘ‌ట‌న‌లో నలుగురు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు మృతి చెందారు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను పోలీసులు వెల్ల‌డించారు. భోర్ త‌స‌హీల్ లో జ‌రిగిన ఘ‌ట‌న‌లో బాధిత మ‌హిళ‌లంద‌రూ ఓ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి నరేగావ్ గ్రామానికి వ‌చ్చారు. అయితే సాయంత్ర స‌మ‌యంలో ఫొటోలు తీసుకోవ‌డానికి సమీపంలోని భట్ఘర్ ఆనకట్టకు వెళ్లారు. అయితే ఆ స‌మ‌యంలో వారంతా నీటిలోకి దిగి స‌ర‌దాగా గ‌డిపారు. 

జూన్ 20లోపు పెగాసెస్ రిపోర్టు సమర్పించండి: సుప్రీంకోర్టు.. ‘29 మొబైళ్లను పరీక్షించాం’

కొంత స‌మ‌యం త‌రువాత ఆ నీటిలో వారంతా మునిగిపోవ‌డం ప్రారంభించారు. అయితే దీనిని వారితో వ‌చ్చిన ఓ తొమ్మిదేళ్ల గ‌మ‌నించింది. వెంట‌నే ప‌రిగెత్తుకుంటూ వెళ్లి స్థానికుల‌కు స‌మాచారం అందించింది. వారు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై అక్క‌డికి చేరుకున్నారు. కానీ ఆ మహిళలను వారు ర‌క్షించ‌లేక‌పోయారు. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం ఐదుగురు మృతి చెందారు. పోలీసులు వ‌చ్చి వారి మృత‌దేహాల‌ను వెలికితీశారు. మృతులను ఖుష్బూ రాజ్‌పుత్ (19), మనీషా రాజ్‌పుత్ (20), చందానీ రాజ్‌పుత్ (21), పూనమ్ రాజ్‌పుత్ (22), మోనికా చవాన్ (23)గా గుర్తించారు. అయితే వీరంద‌రికీ వివాహం అయ్యింద‌ని రాజ్‌గడ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

మరో ఘటనకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఖేడ్ తహసీల్ లోని చసక్మాన్ డ్యామ్ సమీపంలో సహ్యాద్రి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఈ స్కూల్ కు చెందిన న‌లుగురు టెన్త్ క్లాస్ స్టూడెంట్లు ఈ డ్యామ్ బ్యాక్ వాట‌ర్ లో ప‌డి మునిగిపోయారు. ఇందులో ఇద్ద‌రు బాలురు ఉండ‌గా, ఇద్ద‌రు బాలిక‌లు ఉన్నారు. అయితే వీరు ఆ స్కూల్ టీచ‌ర్లు, స్టూడెంట్ల‌తో క‌లిసి ఆ ప్రాంతానికి విహారయాత్ర కోసం వ‌చ్చారు. అయితే వీరు న‌లుగురు స్నానం చేసేందుకు నీటిలో లోతు తెలియ‌క‌పోవ‌డంతో దిగినప్పుడు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నలుగురి మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులను రితిన్ దీదీ, నవ్య భోంస్లే, పరీక్షిత్ అగర్వాల్, తనిష్క్ దేశాయ్‌లుగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

karnataka rains : క‌ర్ణాట‌క‌ను అత‌లాకుత‌లం చేస్తున్న వ‌ర్షాలు.. 9 మంది మృతి..

ఇదే రాష్ట్రంలోని థానే జిల్లాలో ఈ నెల 7వ తేదీన ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. బ‌ట్ట‌లు ఉతికేందుకు క్వారీ వ‌ద్ద‌కు వెళ్లిన ఓ కుటుంబం ఆ నీటిలో ప‌డి ప్ర‌మాద‌వ‌శాత్తు మృతి చెందింది. 5 గురు స‌భ్యులు ఆ నీటిలోనే తుదిశ్వాస విడిచారు. ముంబై డోంబివాలి సమీపంలోని సండాప్ గ్రామంలోని ఓ కుటుంబం నీటితో నిండి ఉన్న క్వారీలో బ‌ట్ట‌లు ఉతికేందుకు వెళ్లారు. ఈ కుటుంబంలో మొత్తం 5గురు స‌భ్యులు ఉండ‌గా ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 

సాయంత్రం నాలుగు గంట‌ల స‌మ‌యంలో ఆ క్వారీ వ‌ద్ద బ‌ట్టలు ఉతుకుతున్న‌ప్పడు ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ బాలిక నీటిలో జారి ప‌డిపోయింది. ఆ చిన్నారిని కాపాడేందుకు కుటుంబ స‌భ్యులు అంద‌రూ క్వారీలో నీటిలో దూకారు. కానీ అందులో లోతు అధికంగా ఉండ‌టం వ‌ల్ల ఐదుగురు మునిగిపోయారు. మృతుల‌ను మీరా గైక్వాడ్ (55), ఆమె కోడలు అపేక్ష (30), మనవరాళ్ళు మయూరేష్ (15), మోక్ష (13), నీలేష్ (15)గా గుర్తించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?