
ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఫతేపూర్‌లో ఆటోను ట్యాంకర్ ఢీకొనడంతో 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి గాయపడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
మరోవైపు.. సోమవారం తెల్లవారుజామున పంజాబ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలభై మంది స్కూల్ పిల్లలు గాయపడిన సంగతి తెలిసిందే. లూధియానాకు 50 కిలోమీటర్ల దూరంలోని జాగ్రావ్‌లో ఈ ఘటన జరిగింది. పాఠశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న మరో పది మంది ప్రయాణీకులు కూడా గాయపడినట్లుగా పోలీసులు తెలిపారు. గాయపడిన చిన్నారులు, ప్రయాణీకులను లూథియానాలోని పలు ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ముగ్గురు విద్యార్ధుల పరిస్ధితి విషమంగా వున్నట్లు సమాచారం.