మ‌హారాష్ట్రలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. పెట్రోల్ ట్యాంక‌ర్, ట్ర‌క్కు ఢీ.. 9 మంది స‌జీవ ద‌హ‌నం..

By team teluguFirst Published May 20, 2022, 3:25 PM IST
Highlights

మహాారాష్ట్రలోని చంద్రాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది సజీవ దహనం అయ్యారు. ఓ పెట్రోల్ ట్యాంకర్, కలపతో నిండి ఉన్న ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ నగర శివార్ల‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. డీజిల్ ట్యాంక‌ర్, క‌ల‌పతో నిండి ఉన్న ఓ ట్ర‌క్కు ఢీకొన‌డంతో ఒక్క సారిగా పెద్ద ఎత్తున మంట‌ల వ్యాపించాయి. ఈ మంట‌ల వ‌ల్ల 9 మంది స‌జీవ ద‌హ‌నం అయ్యారు. మృతుల్లో డ్రైవర్ కూడా ఉన్నాడ‌ని పోలీసులు తెలిపారు. 

ఈ ఘ‌ట‌న బాధితుల మృతదేహాలను చంద్రపూర్ ఆసుపత్రికి తరలించినట్లు ఆ సబ్ డివిజనల్ పోలీసు అధికారి సుధీర్ నందన్వార్ తెలిపారు. గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో చంద్రాపూర్-ముల్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని ఆయ‌న అన్నారు.  “చంద్రాపూర్ నగరం సమీపంలోని అజయ్‌పూర్ సమీపంలో కలప దుంగలను రవాణా చేస్తున్న ట్రక్కును డీజిల్ లోడ్ చేసిన ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత, మంటలు చెలరేగాయి. తొమ్మిది మంది వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు ” అని ఆయ‌న చెప్పారు. 

economic growth: ఈ ఏడాదిలో 8.9 శాతం ఆర్థిక వృద్ది : నిర్మ‌లా సీతారామ‌న్

ఈ ప్ర‌మాదం సంభ‌వించిన వెంట‌నే ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు అక్క‌డికి చేరుకున్నారు. అయితే కొన్ని గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమీపంలోని పలు చెట్లు కూడా మంటల్లో కాలిపోయాయి. అయితే పెట్రోలు ట్యాంకర్ లారీ టైర్ ప‌గిలిపోవ‌డంతో అది ముందు వ‌స్తున్న ట్ర‌క్ ను ఢీకొట్టింద‌ని, దీంతో ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు చెబుతున్నారు. పెట్రోల్ కింద పార‌డంతో ఆ మంట‌లు చుట్టు ప‌క్క‌ల వ్యాపించాయ‌ని, దీంతో అనేక చెట్లు ద‌గ్ధం అయ్యాయ‌ని తెలిపారు. 

ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేను బీజేపీ ఉపయోగించుకుంటోంది - శివ‌సేన ఎంపీ సంజయ్ రౌత్

ఈ నెల 9వ తేదీన ఏపీలోని ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. ఓ లారీ కారును ఢీకొన‌డంతో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. మార్కాపురం మండలం తిప్పాయపాలెంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే భ‌యానికి గురైన లారీ డ్రైవర్, క్లీనర్లు లారీని ఘటనాస్థలంలోనే లారీని వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 

click me!