88 మంది వైద్య సిబ్బందికి కరోనా, క్వారంటైన్ లో మరికొందరు!

By Sree s  |  First Published Apr 27, 2020, 1:14 PM IST

తాజాగా ఢిల్లీలోని రెండు ప్రధాన ఆసుపత్రులకు చెందిన 88 మంది వైద్య సిబ్బంది కరోనా పాజిటివ్ గా తేలారు. జగ్జీవన్ రామ్ హాస్పిటల్ కి చెందిన 58 మంది, అంబేద్కర్ ఆసుపత్రికి చెందిన 30 మంది పాజిటివ్ గా తేలారు. అంబేద్కర్ ఆసుపత్రికి చెందిన దాదాపు 40 మందిని కరోనా లక్షణాలున్నాయన్న అనుమానంతో క్వారంటైన్ కి తరలించారు. 


కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు ఎక్కువవుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.... కేసుల సంఖ్యామాత్రం పెరుగుతూనే ఉంది. ఈ కరోనా వైరస్ కి చికిత్సనందిస్తున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. 

తాజాగా ఢిల్లీలోని రెండు ప్రధాన ఆసుపత్రులకు చెందిన 88 మంది వైద్య సిబ్బంది కరోనా పాజిటివ్ గా తేలారు. జగ్జీవన్ రామ్ హాస్పిటల్ కి చెందిన 58 మంది, అంబేద్కర్ ఆసుపత్రికి చెందిన 30 మంది పాజిటివ్ గా తేలారు. అంబేద్కర్ ఆసుపత్రికి చెందిన దాదాపు 40 మందిని కరోనా లక్షణాలున్నాయన్న అనుమానంతో క్వారంటైన్ కి తరలించారు. 

Latest Videos

ఒక రెండు వారల కింద మాక్స్ హాస్పిటల్ కి చెందిన 39 మంది వైద్య సిబ్బందిని క్వారంటైన్ కి తరలించారు. ఆసుపత్రిలో ఇద్దరు రోగులు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ వార్డుల్లో పనిచేస్తున్న అందరూ వైద్య సిబ్బందిని క్వారంటైన్ కి తరలించారు. 

గతంలో కూడా ఎయిమ్స్ లో పనిచేస్తున్న 30 మంది వైద్య సిబ్బందిని కూడా క్వారంటైన్ కి తరలించారు. ఇలా కరోనా వైరస్ మహమ్మారి వల్ల డాక్టర్లు క్వారంటైన్ కి పరిమితమయితే..... పేషెంట్లకు చికిత్సనందించడానికి వైద్య సిబ్బంది తక్కువపడే ఆస్కారం కూడా లేకపోలేదు. 

ఇకపోతే, దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. సోమవారం నాడు ఉదయానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య27,892కి చేరుకొన్నాయి. వీటిలో 20,835 కేసులు యాక్టివ్ కేసులు. 

కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొంది 6,184 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 892 మంది మరణించారు. మరణించిన వారిలో ఒక వలసకూలీ కూడ ఉన్నాడు.గత 24 గంటల్లో 1396 కొత్త కేసులు నమోదయ్యాయి. 48 మంది చనిపోయారు. 381 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర  ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దేశంలో అత్యధికంగా  మహారాష్ట్రలో  కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం నాడు ఉదయానికి కరోనా కేసుల సంఖ్య 8,068 చేరుకున్నాయి. మహారాష్ట్ర తర్వాతి స్థానంలో గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక కేసులున్నాయని కేంద్రం తెలిపింది.గుజరాత్ రాష్ట్రంలో 3,301 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ తర్వాతి స్థానంలో ఢిల్లీ నిలిచింది. ఢిల్లీలో 2,918 కేసులు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా సోకి కోలుకొన్న రోగుల శాతం 22గా ఉందని కేంద్రం తెలిపింది. ఇతర దేశాలతో పోలిస్తే  ఇండియాలో కోలుకొంటున్న రోగుల శాతం బాగా ఉందని ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి.ఇప్పటి వరకు 5,913 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

 దేశంలో 280 జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదు. ఇందులో  గత వారం రోజులుగా అరవై నాలుగు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

అదేవిధంగా 45 జిల్లాలో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 21 రోజులుగా ముప్పై మూడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక 28 రోజులుగా 18 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

click me!