కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ కరోనా వైరస్ రోగి విక్టోరియా ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. 50 ఏళ్ల వయస్సు గల కోవిడ్ -19 రోగి ఒకతను విక్టోరియా ఆస్పత్రి ట్రామా కేర్ సెంటర్ రోగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. విక్టోరియా ఆస్పత్రి భవనం నుంచి దూకి అతను మరణించాడు.
ఆ విషాదకరమైన సంఘటన సోమవారం ఉదయం 8.30 గంటలకు వెలుగులోకి వచ్చింది. శ్వాసకోశ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న అతనికి కరోనా వైరస్ సోకినట్లు ఈ నెల 24వ తేదీన నిర్ధారణ అయింది.
రెండు రోజుల క్రితం అతన్ని ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. అతనికి ఓసారి డయాలసిస్ జరిగింది. రెండో సారి డయాలసిస్ ఈ రోజు జరగాల్సి ఉండింది. అతను మూడో అంతస్థు నుంచి మొదటి అంతస్థు షెడ్టుపైకి దుమికినట్లు తెలుస్తోంది.
అతనికి వివాహం కాలేదు. అనతు తన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో తిలక్ నగర్ లో ఉంటున్నాడు. కరోనా వైరస్ రోగి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇదే మొదటిది.