గురకతో భాగస్వామికి పాట్లు.. 85 శాతం మందికి నిద్రాభంగం.. 32 శాతం మంది ఆ గురకను బైక్ సౌండ్‌తో పోల్చారు: సర్వే

By Mahesh KFirst Published Mar 17, 2023, 7:33 PM IST
Highlights

గురకతో భాగస్వామి నిద్రకు భంగం కలుగుతున్నదని, 85 శాతం మందికి ఈ సమస్య ఎదురవుతున్నదని సెంచురీస్ మ్యాట్రెసెస్ సర్వే వెల్లడించింది. 32 శాతం మంది దంపతుల్లో ఒకరు తమ భాగస్వామి గురకను మోటార్ సైకిల్ సౌండ్‌తో పోల్చారని తెలిపింది.
 

హైదరాబాద్: ఈ రోజు ప్రపంచ నిద్ర దినోత్సం. ప్రత్యేకంగా నిద్రకు ఒక రోజు కేటాయించడమే.. దానికి గల ప్రాధాన్యతను వెల్లడిస్తున్నది. ప్రతి ఒక్కరి వ్యక్తిగత, వృత్తిగత ప్రగతిలో నిద్ర చాలా ముఖ్యమైంది. ఒంటికి సరిపడా నిద్ర అందితే.. ఆ రోజంతా హుషారుగా టార్గెట్లు రీచ్ కావొచ్చు. రాత్రిళ్లు శబ్దాల అంతరాయంతో సరైన నిద్రలేకపోతే.. రోజంతా నీరసంగా గడుస్తుంది. ముఖ్యంగా పక్కకే పడుకునే భాగస్వాములకు గురక ఉంటే అది ఎదుటి వారి ఆరోగ్యంపై పెను ప్రభావం వేస్తుంది. ఈ గురక గురించి మాట్లాడటం, దాన్ని ఒక సమస్యగా చూడటం, పరిష్కారాల గురించి సమాలోచనలు చేస్తున్నారని, ఇది ఆశిందగిన పరిణామం అని సెంచురీ మ్యాట్రెస్ వరల్డ్ స్లీప్ డే సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

స్లీప్ స్నోర్ కార్డ్ సర్వే ప్రకారం, తమ భాగస్వామికి గురక పెట్టడం వల్ల 85 శాతం మందికి నిద్రాభంగం అవుతున్నది. గురక కారణంగా వీరికి నిద్ర నుంచి మెలకువ వస్తున్నది. ప్రతి పది జంటల్లో ఏడు జంటలు భాగస్వామి గురక తమను ఇబ్బంది పెడుతున్నదని గుర్తించారు. అంతేకాదు, ప్రతి పది జంటల్లో ఏడు జంటలు తమ భాగస్వామి పెడుతున్న గురకను రికార్డ్ చేసి వినిపిస్తున్నారు. అంతేకాదు.. 32 శాతం దంపతులు తమ భాగస్వామి పెట్టే గురక మోటార్ సైకిల్ సౌండ్‌లా ఉంటున్నదని పోల్చారు కూడా.

ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, విశాఖపట్నం, భువనేశ్వర్, పాట్నా, గువహతిలలో 27 నుంచి 50 ఏళ్ల వయసున్న 2,700కి పైగా మందిని సర్వే చేసి దీన్ని రూపొందించారు.

Also Read: కేరళలో వలస కార్మికుడికి రూ. 75 లక్షల లాటరీ.. వెంటనే పోలీసు స్టేషన్‌కు పరుగుతీశాడు.. ఎందుకో తెలుసా?

ఈ సర్వే ప్రకారం, 67 శాతం మంది గురక పని చేసి అలసిపోవడానికి, కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా వస్తుందని భావిస్తున్నారు. 45 శాతం మంది గురకకు ఊబకాయంతో లింక్ ఉన్నదని అనుకుంటున్నారు. కాగా, చిన్న చిన్న మార్పులతో గురకను తగ్గించుకోవచ్చని 55 శాతం మంది భావిస్తున్నారు.

సెంచురీ మ్యాట్రెసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ ఈ సర్వే ఫలితాలపై కామెంట్ చేస్తూ.. గురకను సీరియస్‌గా తీసుకుని దాని వల్ల కలిగే ఆరోగ్య, వ్యక్తుల మధ్య సంబంధాల మధ్య సమస్యలను నివారించుకోవాలని సూచించారు. గురక ద్వారా దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయని అన్నారు. బెంగళూరులోని ముక్కు, సైనస్ సర్జన్ డాక్టర్ జగదీశ్ చతుర్వేది మాట్లాడుతూ, గురకను ఒక సమస్యగా పరిగణించి, దాన్ని అంగీకరిస్తున్నారని ఈ సర్వే వెల్లడిస్తున్నదని అన్నారు. గురక గురించి దీర్ఘకాలం వైద్యుల సలహా తీసుకోకుండా ఉంటే అవి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని తెలిపారు.

click me!