దేశంలోని పలు విమానాశ్రయాల నుండి ఇవాళ బయలుదేరాల్సిన పలు విమానాలు సోమవారం నాడు రద్దయ్యాయి. దీంతో ఎయిర్ పోర్టుల్లోనే ప్రయాణీకులు గంటలపాటు ఎదురు చూశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే 82 విమానాలు రద్దయ్యాయి.
న్యూఢిల్లీ: దేశంలోని పలు విమానాశ్రయాల నుండి ఇవాళ బయలుదేరాల్సిన పలు విమానాలు సోమవారం నాడు రద్దయ్యాయి. దీంతో ఎయిర్ పోర్టుల్లోనే ప్రయాణీకులు గంటలపాటు ఎదురు చూశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే 82 విమానాలు రద్దయ్యాయి.
లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు మాసాల తర్వాత సోమవారం నాడు ఉదయం నుండి డొమెస్టిక్ విమానాల రాకపోకలకు సివిల్ ఏవియేషన్ శాఖ అనుమతి ఇచ్చింది.
విమానాల రాకపోకల నేపథ్యంలో ప్రయాణీకులకు కేంద్ర విమానాయాన శాఖ కీలకమైన సూచనలను కూడ మూడు రోజుల క్రితం విడుదల చేసింది.
సోమవారం నాడు నిర్ధేశించిన షెడ్యూల్ సమయంలో విమానాల రాకపోకలు ప్రారంభం కాలేదు. చివరి క్షణంలో విమానాలు రద్దు చేయడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.
also read:విమాన ప్రయాణీకులకు ఏపీ సర్కార్ గైడ్‌లైన్స్ ఇవీ....
విమానాలు రద్దైన విషయం కనీసం ప్రయాణీకులకు సమాచారం అందలేదు.ఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి వెళ్లాల్సిన 82 విమానాలు రద్దయ్యాయి.
ఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి 125 విమానాలు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. మరో 118 విమానాలు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు ఇవాళ రావాల్సి ఉంది.
ముంబై ఎయిర్ పోర్టు నుండి ఇవాళ 50 విమానాలు నడవాల్సి ఉంది. 25 విమానాలు ముంబై నుండి ఇతర ఎయిర్ పోర్టులకు వెళ్లాల్సి ఉంది. మరో 25 విమానాలు ముంబై ఎయిర్ పోర్టు కు రావాల్సి ఉంది. ఇవాళ ఉదయం నాలుగున్నర గంటలకు ఢిల్లీకి, ఉదయం ఆరున్నర గంటలకు పాట్నాకు ముంబై ఎయిర్ పోర్టు నుండి విమానాలు బయలుదేరాయి.
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి 100 విమానాలు వెళ్లాల్సి ఉంది.కానీ ఇవాళ కేవలం 30 విమానాలు మాత్రమే రాకపోకలు కొనసాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రయాణీకులు విమానాల కోసం ఎయిర్ పోర్టులో పడిగాపులు పడుతున్నారు.