గన్ కల్చర్ పై పంజాబ్ సర్కార్ కన్నేర్ర.. వందలాది ఆయుధాల లైసెన్స్‌ల రద్దు..

Published : Mar 15, 2023, 12:39 AM IST
గన్ కల్చర్ పై పంజాబ్ సర్కార్ కన్నేర్ర.. వందలాది ఆయుధాల లైసెన్స్‌ల రద్దు..

సారాంశం

గన్ కల్చర్ కు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత రెండు నెలల్లో 813 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇందులో 89 లైసెన్సులు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తుల పేర్లతో జారీ అయ్యాయయని పేర్కొంది.  

పంజాబ్ లో తుపాకీ సంస్కృతి, హింసను ప్రోత్సహించేలా పాటలు, ఆయుధాల బహిరంగ ప్రదర్శనను ఆప్ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో నిషేధించింది. అలాగే రాష్ట్రంలో జారీ చేసిన అన్ని ఆయుధ లైసెన్స్‌లను తనిఖీ చేయాలని ఆదేశించారు. పంజాబ్ ప్రభుత్వం రద్దు చేసిన 813 ఆయుధాల లైసెన్సుల్లో లూథియానా రూరల్‌లో 87, షహీద్ భగత్ సింగ్ నగర్‌లో 48, గురుదాస్‌పూర్‌లో 10, ఫరీద్‌కోట్‌లో 84, పఠాన్‌కోట్‌లో 199, హోషియార్‌పూర్‌లో 47, కపుర్తలాలో 6, సంగర్‌పూర్‌లో 235 లైసెన్స్‌లు ఉన్నాయి. 16 K, 27 అమృత్‌సర్, 11 జలంధర్, ఇతర జిల్లాలు చేర్చబడ్డాయి. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటి వరకు 2000కి పైగా ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేసినట్టు తెలుస్తోంది.  

3.73 లక్షలకు పైగా ఆయుధ లైసెన్స్‌లు  

రాష్ట్రంలో 3.73 లక్షలకు పైగా ఆయుధాల లైసెన్స్‌లు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. గురుదాస్‌పూర్ జిల్లా గరిష్టంగా 40,789 లైసెన్స్‌లను జారీ చేసింది. కాగా.. బటిండాలో 29353, పాటియాలాలో 28,340, మోగాలో 26,756, అమృత్‌సర్ (రూరల్)లో 23,201, ఫిరోజ్‌పూర్‌లో 21,432 లైసెన్స్‌లు చేయబడ్డాయి.  

ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుఖ్‌చైన్ సింగ్ గిల్ మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌లో 8,100 ఆయుధాల లైసెన్సుల సస్పెన్షన్ లేదా రద్దుకు సిఫార్సు చేసినట్లు  తెలిపారు. ఇప్పటికే 800 పైగా ఆయుధాల లైసెన్సులను రద్దు చేసినట్టు, దాదాపు 1,460 సస్పెండ్ చేయబడినట్టు తెలిపారు. అన్ని లైసెన్సులను సమీక్షిస్తున్నామని తెలిపారు. ఇది కొనసాగుతున్న ప్రక్రియ అని తెలిపారు. ఎక్కడైనా ఉల్లంఘనలు తెరపైకి వస్తున్నా.. వీటిని రద్దు చేయడం లేదా సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. 

గత నెలలో.. అమృత్‌పాల్, అతని మద్దతుదారులలో కొందరు కత్తులు, తుపాకులు చూపుతూ, బారికేడ్‌లను ఛేదించి, అమృత్‌సర్ నగర శివార్లలోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. అమృత్‌పాల్ సహాయకులలో ఒకరిని విడుదలని పోలీసులతో ఘర్షణ పడ్డారు.

రాష్ట్రంలో ఆయుధాల గ్లోరిఫికేషన్‌పై ఇప్పటివరకు 170 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు. ఇదిలా ఉండగా, డ్రగ్స్ సమస్యపై, 2022 జూలై 5 నుంచి పంజాబ్ పోలీసులు 1628 డీలర్లతో  సహా 11,360 మంది డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేశారని గిల్ చెప్పారు. ఈ క్రమంలో 8,458 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయనీ, వాటిలో 962 వాణిజ్య పరిమాణానికి సంబంధించినవని ఆయన చెప్పారు.

జూలై నుండి పోలీసు బృందాలు రాష్ట్రవ్యాప్తంగా దుర్బలమైన మార్గాల్లో 'నాకాస్' వేయడంతో పాటు మాదకద్రవ్యాల ప్రభావిత ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా 612.78 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే.. గుజరాత్, మహారాష్ట్రలోని ఓడరేవుల నుండి పంజాబ్ పోలీసుల బృందాలు 147.5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి, కేవలం ఎనిమిది నెలల్లో 760.28-కిలోల  హెరాయిన్ ను పట్టుకున్నట్టు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !