కర్ణాటకలో కరోనా అనుమానితుడు మృతి: ఇంకా రాని రిపోర్టులు

By Siva Kodati  |  First Published Mar 11, 2020, 2:57 PM IST

కర్ణాటకలో ఓ కరోనా అనుమానిత రోగి ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు బుధవారం ప్రకటించారు. కలబుర్గికి చెందిన 76 ఏళ్ల మహ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ ఇటీవల యాత్రల నిమిత్తం సౌదీ అరేబియాలో పర్యటించి ఇటీవల భారతదేశానికి తిరిగివచ్చాడు


చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రస్తుతం 93 దేశాల్లో సుమారు లక్ష మందికి ఇది వ్యాపించగా ఇప్పటి వరకు 4 వేల మంది వరకు దీని కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అటు భారత్‌లోనూ కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

ఈ సంగతిని పక్కనబెడితే కర్ణాటకలో ఓ కరోనా అనుమానిత రోగి ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు బుధవారం ప్రకటించారు. కలబుర్గికి చెందిన 76 ఏళ్ల మహ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ ఇటీవల యాత్రల నిమిత్తం సౌదీ అరేబియాలో పర్యటించి ఇటీవల భారతదేశానికి తిరిగివచ్చాడు.

Latest Videos

undefined

Also Read:ఇదేం ఆఫర్... కరోనా వైరస్ ఎక్కించుకుంటే రూ.3లక్షలా..!

ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యానికి గురవ్వడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. సిద్ధిఖీని పరీక్షించిన వైద్యులు ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు ఆయన రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం బెంగళూరులోని ప్రయోగశాలకు తరలించారు.

ఇందుకు సంబంధించిన నివేదికలు రాకుండానే సిద్ధిఖీ ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో వైద్యులు వణికిపోతున్నారు. మహ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ కరోనా వల్ల చనిపోయారా లేదా అన్నది రిపోర్టుల వచ్చిన తర్వాతే ధ్రువీకరిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు.

Also Read:నెల్లూరులో వ్యక్తికి కరోనా లక్షణాలు

మరోవైపు భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 60కి చేరింది. వీరిలో 16 మంది ఇటాలియన్లు కాగా మిగిలిన వారంతా భారతీయులని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా అనుమానితులకు కనీసం రెండు సార్లు పరీక్సలు నిర్వహించిన తర్వాతే వైరస్‌ను నిర్థారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

click me!