దారుణం: మూడు సంవత్సరాలుగా టాయ్ లెట్ లోనే.. తిండ్రి, నిద్ర కూడా

By telugu teamFirst Published Dec 10, 2019, 11:49 AM IST
Highlights

ఆమె ఉండటానికి ఇళ్లు లేదు. ప్రభుత్వం ఇళ్లు ఇస్తామని చెబుతోందే తప్ప... ఇప్పటికీ ఇవ్వడం లేదు. వంట చేయడం దగ్గర నుంచి తిండ్రి తినడం, నిద్రపోవడం కూడా అందులోనే చేస్తోంది. ఆమె మనవడు, మనవరాలు మాత్రం ఆ టాయ్ లెట్ బయట నిద్రిస్తుంటారు.

 72ఏళ్ల మహిళ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సంవత్సరాలపాటు అందులోనే ఉంటుంది. వంట చేయడం.. తినడం, నిద్రపోవడం... అన్నీ ఆ టాయ్ లెట్ లోనే. ఆమెతోపాటు.. మనవడు, మనవరాలు కూడా ఉన్నారు. వారు కూడా అక్కడే ఉంటున్నారు. వాళ్లు కూడా అందులోనే ఉండటం గమనార్హం. ఈ దారుణ సంఘటన ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సదరు మహిళ పేరు ద్రౌపది బెహరా. ఆమె వయసు ప్రస్తుతం 72 సంవత్సరాలు. ట్రైబల్ కులానికి చెందిన సదరు మహిళ.. మూడు సంవత్సరాలుగా టాయ్ లెట్ లోనే నివసిస్తోంది. ఆమె ఉండటానికి ఇళ్లు లేదు. ప్రభుత్వం ఇళ్లు ఇస్తామని చెబుతోందే తప్ప... ఇప్పటికీ ఇవ్వడం లేదు. వంట చేయడం దగ్గర నుంచి తిండ్రి తినడం, నిద్రపోవడం కూడా అందులోనే చేస్తోంది. ఆమె మనవడు, మనవరాలు మాత్రం ఆ టాయ్ లెట్ బయట నిద్రిస్తుంటారు.

ఆ టాయ్ లెట్ కూడా కనికా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ నిర్మించి ఇచ్చింది. ప్రభుత్వ పథకం కింద ఆమెకు ఇళ్లు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రాలేదు. ప్రభుత్వం ఇచ్చే ఇంటి కోసం ఆమె వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. కాగా... ఆమె పరిస్థితిపై మీడియా గ్రామ సర్పంచిని ప్రశ్నించగా... ఆమెకు ఇళ్లు కట్టించే అధికారం తనకు లేదని చెప్పాడు. 

Odisha: A 72-year-old widowed tribal woman, Draupadi Behera has been living in a toilet for the last 3 years in Mayurbhanj. Budhuram Puty, Sarpanch says, "I have no power to build a house for her. If a house comes through any of the schemes, we will provide it to her". (9.12.19) pic.twitter.com/CzJq988SQn

— ANI (@ANI)

 

click me!