రసగుల్లా.. ఈ పేరు వింటే చాలు.. మనసు పులికరిస్తుంది. అట్లుంటది మరి ఈ స్వీట్. ఉత్తర భారత దేశంలో ఈ స్వీట్ లేకుండా.. వివాహాలు, విందులు జరగవంటే.. అతిశయోక్తి కాదు. ఈ ప్రధానం అక్కడ స్వీట్స్ కు చాలా ప్రాధ్యానత ఇస్తారు. అయితే.. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ వివాహా విందులో తేడా జరిగింది. రసగుల్ల తిన్న బంధువుల ఆరోగ్యం గుల్ల అయ్యింది. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు.
వివరాలోకెళ్తే... కన్నౌజ్‌లోని మధర్‌పూర్ గ్రామంలో బుధవారం ఓ వివాహవేడుక జరిగింది. ఈ వేడుక విందులో భోజనం చేసిన పలువురు చిన్నారులతో సహా దాదాపు 70 మంది ఫుడ్‌పాయిజనింగ్‌కు గురయ్యారు. రసగుల్లా విన్న బంధువులకు వాంతులు, విరేచనాలు అయ్యాయని, అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారని స్థానికులు తెలిపారు.
అదే సమయంలో ఇర్ఫాన్ ఖాన్ (48), షాజియా (7), రియాజుద్దీన్ (55), అర్జూ (1), అజ్రా (5), షిఫా (4), యూసుఫ్ (2), సుల్తాన్ (52) ఇంకా చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శక్తి బసు మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో రోగులందరి పరిస్థితి నిలకడగా ఉందని, కొందరిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. విందుకు హాజరైన దాదాపు అందరూ రసగుల్లాను తిన్నారని, దీంతో పలువురు అస్వస్థతకు గురయ్యారని గ్రామానికి చెందిన మున్నా తెలిపారు.