జమ్మూ కాశ్మీర్ ఘోర ప్రమాదం.. అదుపు తప్పిన ట్రక్కు.. ముగ్గురు జవాన్లకు గాయాలు

By Rajesh Karampoori  |  First Published May 25, 2023, 4:24 AM IST

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొరా వద్ద వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు.


జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  పండ్ల లోడ్ తో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి.. రోడ్డుకు అవతలి వైపు ఉన్న CRPF వాహనానికి ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు CRPF సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన అవంతిపొరలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ఘటనలో 130 బిలియన్లకు చెందిన ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారని తెలిపారు.

గాయపడిన ముగ్గురు జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది. రోడ్డుకు ఒకవైపు సీఆర్పీఎఫ్ వాహనం నిలబడి ఉండగా, అకస్మాత్తుగా మరోవైపు నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు CRPFవాహనాన్ని బలంగా ఢీకొట్టి.. అనంతరం బోల్తా పడటం వీడియోలో చూడవచ్చు. లారీ బోల్తా పడడంతో రోడ్డుపై పండ్లు కూడా చెల్లాచెదురుగా పడ్డాయి.

Latest Videos

CRPF సిబ్బంది వారి ROP (రోడ్ ఓపెనింగ్ పార్టీ) డ్యూటీలో భాగంగా చెక్-పాయింట్ 24×7 వద్ద మోహరించారు. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది విధుల్లో ఉండగా, వేగంగా వెళ్తున్న ట్రక్కు హైవేపై అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న సీఆర్‌పీఎఫ్ వాహనాన్ని ఢీకొట్టింది. గాయపడిన జవాన్ల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

యూపీలో సీఆర్పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మృతి

మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో మోటారుసైకిల్‌పై వెళ్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సబ్-ఇన్‌స్పెక్టర్, అతని భార్యను వేగంగా కారు ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. సిఆర్‌పిఎఫ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా సోనెపట్‌లో విధులు నిర్వహిస్తున్న జబర్ సింగ్ (55)గా గుర్తించారు. అతడు తన కుమారుడి వివాహం పనుల నిమిత్తం సెలవుపై షరీఫ్‌పూర్ గ్రామంలోని తన ఇంటికి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఢీకొన్న కారును పోలీసులు అదుపులోకి తీసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

click me!