మణిపూర్‌లో మరోసారి హింసాకాండ.. ఒకరి మృతి, పలు ఇళ్లు దగ్ధం..

Published : May 25, 2023, 05:04 AM IST
మణిపూర్‌లో మరోసారి హింసాకాండ.. ఒకరి మృతి, పలు ఇళ్లు దగ్ధం..

సారాంశం

Manipur Violence: మణిపూర్‌లో బుధవారం జరిగిన హింసాకాండలో 29 ఏళ్ల యువకుడిని వేరే వర్గానికి చెందిన వారు కాల్చి చంపారు. అలాగే.. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటనల దృష్ట్యా, బిష్ణుపూర్, ఇంఫాల్ ఈస్ట్ , ఇంఫాల్ వెస్ట్ అనే మూడు జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపును జిల్లా అధికారులు రద్దు చేశారు. గతంలో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు.

Manipur Violence: మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత మూడు వారాలుగా మైయిటీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణలు క్రమంగా హింసాత్మక మారాయి. తాజాగా బుధవారం మరోసారి మణిపూర్ లో హింస చెలరేగింది. హింసాకాండ మధ్య ఓ వర్గం ..మరో వర్గానికి చెందిన 29 ఏళ్ల యువకుడిని హత్య చేసింది. వేరే వర్గానికి చెందిన వారు కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనలో తోయిజం చంద్రమణి అనే వ్యక్తి బుల్లెట్ గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు పారామిలటరీ బలగాలు, పోలీసు అధికారులను రంగంలోకి దింపారు. మరోవైపు బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. హింసాత్మకమైన బిష్ణుపూర్, ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల్లో ఉదయం 5 నుండి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూలో సడలింపు రద్దు చేయబడింది.

మూడు వారాలుగా కొనసాగుతున్న హింసాకాండ..  71 మంది మృతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి బిష్ణుపూర్‌లోని ఫోబ్‌కాచోలో వివిధ వర్గాలకు చెందిన నాలుగు ఇళ్లు దగ్ధమయ్యాయి. దీనికి ప్రతిగా ఇతర వర్గాలకు చెందిన వారు మరో నాలుగు ఇళ్లను తగులబెట్టారు. మూడు వారాలుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో మణిపూర్‌లో 71 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా.. మంగళవారం రాత్రి మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని కాంగ్‌చుప్ చిగ్‌కోంగ్ జంక్షన్ వద్ద ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 

మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు మరిన్ని సైన్యాన్ని మోహరిస్తామని హింసాత్మక మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపారు. మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున రెండు జిల్లాల్లో మరోసారి కాల్పుల ఘటనలు తెరపైకి వచ్చాయన్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మరోవైపు బిష్ణుపూర్, చురచంద్‌పూర్ జిల్లాల్లో పూర్తి కర్ఫ్యూ విధించారు. చురచంద్‌పూర్ జిల్లాలోని NH 2ను నిరసనకారులు ఆక్రమిస్తూనే ఉన్నారు. ఈ మార్గంలో వాహనాలు బారులు తీరుతున్నాయి. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

ఈ ఘటనపై మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, అయితే అదుపులోనే ఉందని చెప్పారు. మణిపూర్ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 11 జిల్లాల్లో హింసకు ప్రభావితం అయ్యాయనీ,  మే 3 నుంచి రాష్ట్రంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని తెలిపారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, టెరిటోరియల్ ఆర్మీ 11 జిల్లాల్లోని 23 అత్యంత సున్నితమైన మోహరించారు. మరిన్ని కేంద్ర బలగాలను పంపాల్సిందిగా సీఎం బీరెన్ సింగ్ కోరారు.

ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు 

మణిపూర్‌లో గత మూడు వారాలుగా హింసాకాండ జరుగుతోంది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు సాధారణం కంటే రెట్టింపు అయ్యాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బియ్యం, బంగాళదుంపలు, కోడిగుడ్లు, ఎల్‌పీజీ సిలిండర్లు, పెట్రోలు ధరల పెరుగుదలతో ప్రజలు రెట్టింపు అవస్థలు పడుతున్నారు.

ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మంగ్లెన్‌బి చనం మాట్లాడుతూ గతంలో 50 కిలోల సూపర్‌ఫైన్ బియ్యం బస్తా ధర రూ.900 ఉండగా, ఇప్పుడు అది రూ.1,800కి పెరిగిందన్నారు. బంగాళదుంపలు, ఉల్లి ధరలు కూడా ఇరవై నుంచి ముప్పై రూపాయలకు పెరిగాయి. ఎల్పీజీ సిలిండర్లను రూ.1800లకు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.170కి విక్రయిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?