పంజాబ్ లూథియానాలో విషాదం: గుడిసెకు నిప్పంటుకొని ఏడుగురు సజీవ దహనం

Published : Apr 20, 2022, 10:05 AM ISTUpdated : Apr 20, 2022, 10:20 AM IST
పంజాబ్ లూథియానాలో విషాదం: గుడిసెకు నిప్పంటుకొని ఏడుగురు సజీవ దహనం

సారాంశం

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో బుధవారం నాడు తెల్లవారుజామున విషాదం చోటు చేసుకొంది. ఓ గుడిసెలో చెలరేగిన మంటల్లో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు.

లూథియానా:పంజాబ్ రాష్ట్రంలోని Ludhiana లో బుధవారం నాడు తెల్లవారుజామున విషాదం చోటు చేసుకొంది.  ఓ ఇంట్లో చెలరేగిన మంటలు ఒకే కుటుంబానికి చెందిన Seven సజీవ దహనానికి కారణమైంది. లూథియానాలోని టిబ్బా రోడ్డులో మున్సిపల్ చెత్తడంప్ యార్డుకు సమీపంలో గల గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందని లూథియానా ఈస్ట్ కమిషనర్ సురీందర్ సింగ్ చెప్పారు. సజీవదహనమైన వారిలో ఐదుగురు పిల్లలతో పాటు వారి పేరేంట్స్ గా గుర్తించారు. 

మరణించిన వారిలో నలుగురు అమ్మాయిలు, రెండేళ్ల అబ్బాయి ఉన్నారని పోలీసులు చెప్పారు. బుధవారం నాడు తెల్లవారుజాము 3 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.సురేష్ షాన్, అతని భార్య రాణదేవి, రాకీ కుమారి, మనీషా కుమారి, చంద కుమారి, గీతా కుమారి, సన్నీలు మరణించారని పోలీసులు ప్రకటించారు.ఈ ప్రమాదం నుండి రాజేష్ ఒక్కడే ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారని పోలీసులు చెప్పారు. 

గుడిసెకు నిప్పు అంటుకున్న విషయం స్థానికులు తమకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశామని అగ్నిమాపక అధికారి ఆతీష్ రాయ్ చెప్పారు. గుడిసెకు ఎలా నిప్పు అంటుకుందనే విషయమై తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?