కర్ణాటకలోని హోటల్ లో కాంట్రాక్టర్ మృతి మరువకముందే.. మరో ఆత్మహత్య..

Published : Apr 20, 2022, 09:47 AM ISTUpdated : Apr 20, 2022, 09:48 AM IST
కర్ణాటకలోని హోటల్ లో కాంట్రాక్టర్ మృతి మరువకముందే.. మరో ఆత్మహత్య..

సారాంశం

కర్ణాటకలోని ఓ హోటల్ లో గతవారం ఓ కాంట్రాక్టర్ మృతి చెందాడు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే మరో ఆత్మహత్య కేసు వెలుగులోకి వచ్చింది. అయితే కాంట్రాక్టర్ మృతి తరువాత ఇటీవలే హోటల్ పేరు కూడా మార్చినట్లు తెలుస్తోంది.

ఉడిపి : udipiలోని ఓ హోటల్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత వారం బెలగావికి చెందిన Civil Contractor సంతోష్ పాటిల్ deathతో వార్తల్లో నిలిచిన పట్టణంలోని ఓ హోటల్.. విచారణ తరువాత తిరిగి తెరిచాక మంగళవారం మరో suicideకు సాక్షిగా నిలిచింది. విచారణ నేపథ్యంలో మూతపడ్డ హోటల్‌ను ఇటీవలే పూజలు చేసిన తరువాత తెరిచారు. అంతేకాదు కాంట్రాక్టర్ మరణంతో అందరి నోళ్లలో నానిన లాడ్జ్ పేరును కూడా దాని యజమానులు మార్చారని ఒక అధికారి తెలిపారు.

దక్షిణ కన్నడలోని అంబలమొగరుకు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ శరణ్ రాజ్ (31) మంగళవారం హోటల్ గదిలో శవమై కనిపించాడు. సోమవారం చెక్ ఇన్ చేసిన ఆయన మంగళవారం ఉదయం 8.30 గంటలకు చెక్ అవుట్ చేయాల్సి ఉంది. అయితే, గదిలో ఎలాంటి అలికిడీ లేకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి వచ్చి.. తలుపులు తెరిపించి చూడగా శరణ్ రాజ్  సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

ప్రేమలో వైఫల్యం కారణంగానే అతనీ తీవ్ర చర్యకు పూనుకున్నాడని పోలీసులు తెలిపారు. అతను ప్రేమించిన బాలికకు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం.

విచారణ కొనసాగుతోంది..
సివిల్ కాంట్రాక్టర్ మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప , అతని సహాయకులు 40% కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపించిన బెలగావికి చెందిన సంతోష్ పాటిల్ (37) గత వారం చనిపోయాడు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసు బృందాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాయి. పశ్చిమ రేంజ్ ఐజిపి బుధవారం కేసు అభివృద్ధిని సమీక్షిస్తారని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలోని.. హనుమకొండలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. Constable వేధింపులు తాళలేక యువతి suicideకు పాల్పడిన ఘటన hanumakonda జిల్లా శాయంపేట మండలం తహరాపూర్ లో చోటుచేసుకుంది. ఎస్సై వీరభద్ర రావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం... తహరాపూర్ కు చెందిన దొంగరి సంగీత (30) ములుగు జిల్లా ఏటూరునాగారంలో ICDS పర్యవేక్షకులుగా పనిచేస్తోంది. హనుమకొండ ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సర్వేశ్ యాదవ్ ఆమెకు కొద్ది నెలల కిందట పరిచయమయ్యాడు. ఆ పరిచయం వన్ సైడ్ లవ్ గా మారింది. దీంతో సంగీతను వేధించడం మొదలుపెట్టాడు.

పెళ్లి చేసుకోవాలంటూ సంగీతకు అతను తరచూ ఫోన్ చేసి వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం రోజు వారి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సంగీత.. తన గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగి.. తన సోదరికి తెలియజేసింది. వెంటనే పరకాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి  తరలిస్తుండగా మృతి చెందింది.  మృతురాలి తండ్రి  వీరయ్య  ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేశామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?