యూపీలో ఘోర ప్రమాదం: టూరిస్ట్ బస్సు, ట్రక్కు ఢీ: ఏడుగురు మృతి

Published : May 29, 2022, 10:47 AM ISTUpdated : May 29, 2022, 01:04 PM IST
యూపీలో ఘోర ప్రమాదం: టూరిస్ట్ బస్సు, ట్రక్కు ఢీ: ఏడుగురు మృతి

సారాంశం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. టూరిస్ట్ బస్సు, ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


లక్నో: Uttarpradesh రాష్ట్రంలోని  Ayodhya లో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. Bahraich-Lakhimpur జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కర్ణాటక నుండి 16 మందితో కూడిన బస్సు అయోధ్యకు వెళ్లున్న సమయంలో మోతీపూర్ ప్రాంతంలో నానిహా మార్కెట్ వద్ద ఎదురుగా ఉన్న లేన్ లోకి ప్రవేశించడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అదనపు పోలీస్ సూపరింటెండ్ ఆశోక్ కుమార్ చెప్పారు.

బస్సు డ్రైవర్ తో సహా ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరణించారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. ఈ ఘటనపై విచారన చేస్తున్నామని ఎఎస్పీ తెలిపారు.ఈ ప్రమాదంలో మరణించిన వారికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.

 తెలంగాణ జిల్లాలోని సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్  మండలం అలీ రాజ్ పేట్ బ్రిడ్జి వద్ద ఈ నెల 27న ప్రమాదం జరిగింది. జగదేవ్ పూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో  మెదక్ వెళ్తోంది.  ఆటోకి ఎదురుగా వస్తున్న లారీ అలీరాజ్‌పేట వద్ద ఢీకొంది.  ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.  తీవ్రగాయాలైన నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యలో మరణించారు.  మిగిలిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో జగదేవ్‌పూర్ లో విషాదఛాయలు అలముకున్నాయి. 

ఈ నెల 26న  ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో ఇలాంటి ప్రమాదమే జరిగింది.కారు కల్వర్టును ఢీకొనడంతో.. కారులోని నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. చనిపోయినవారిని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. 

కృష్ణా జిల్లాలోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని మోపిదేవి మండలంలో చోటుచేసుకుంది. చల్లపల్లి మండలంలోని చింతమడ నుంచి పెళ్లి బృందం మోపిదేవి మండలం పెడప్రోలు గ్రామంలో జరుగుతున్న పెళ్లి వేడుకలకు  బయలుదేరింది. ఈ  వాహనం మోపిదేవి మండలం కాశానగర్ వద్ద వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. 

also read:ఉమ్మి వేసేందుకు కారు డోర్ తీయడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి.. అసలు ఏం జరిగిందంటే..

ఈ ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం మీద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు.  గాయపడిన వారిని అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.  గాయపడిన వారిని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు. 

 ఈ నెల 16న  ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా కురబలకోట మంలం మదనపల్లి-రాయచోటి ప్రధాన రహదారిమీద మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఒకే కటుంబానికి చెందిన నలుగురు మదరనల్లి నుంచి స్వగ్రామం కలిచెర్లకి వెల్తుండగా ఈ ఘటన జరిగింది

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu