వార్నీ.. ప్రేయసితో పారిపోయేందుకు ఓ వ్యక్తిని చంపి.. తానేనని నమ్మించాలని.. ఓ వృద్ధుడి మాస్టర్ ప్లాన్..

Published : Dec 29, 2022, 07:22 AM ISTUpdated : Dec 29, 2022, 07:23 AM IST
వార్నీ.. ప్రేయసితో పారిపోయేందుకు ఓ వ్యక్తిని చంపి.. తానేనని నమ్మించాలని.. ఓ వృద్ధుడి మాస్టర్ ప్లాన్..

సారాంశం

ప్రేయసితో లేచిపోవాలనుకున్న ఓ 65 యేళ్ల వృద్ధుడు దారుణానికి తెగించాడు. తనలాంటి వ్యక్తిని చంపేసి.. తల, మొండెం వేరు చేసి.. తన బట్టలు వేశాడు. చివరికి.. 

మహారాష్ట్ర : మహారాష్ట్రలో ఓ వృద్ధుడు దారుణానికి తెగించాడు. ప్రియురాలితో కలిసి పారిపోయేందుకు, ఆ విషయం ఇంట్లో తెలిసి.. గొడవ జరగకుండా ఉండాలని మరో వ్యక్తిని చంపేసి..  తానే చనిపోయానని నమ్మించాలని అనుకున్నాడు. దాని కోసం ఓ వ్యక్తిని చంపేసి తల మొండెం వేరు చేసి తన బట్టలు అతని శరీరానికి  తొడిగించాడు. కానీ చివరికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే..  మహారాష్ట్రలోని ఖేడ్ జిల్లాకు చెందిన కర్బా చబన్ థోర్వ్ అలియాస్ సుభాష్ (65)అనే వృద్ధుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

అంతటితో ఆగకుండా... ఆమెతోనే జీవితం కాలం గడపాలనుకున్నాడు. అయితే ఈ విషయం ఇంట్లో తెలిసి గొడవ జరగకుండా ఉండాలని..  ఆమెతో కలిసి తాను ఎక్కడికైనా పారిపోవాలి అనుకున్నాడు. అందుకోసం ఓ దారుణమైన ఆలోచన చేశాడు. మరో వ్యక్తిని చంపేసి.. చనిపోయింది తానే అని నమ్మించాలి అనుకున్నాడు.  దీనికోసం రవీంద్ర భీమీజీ ఘెనంద్ అనే వ్యక్తిని ఎంచుకున్నాడు. అతడిని ఈ నెల 16వ తేదీన చంపేశాడు. ఆ తర్వాత శరీరం నుంచి తల, మొండెంను వేరు చేశాడు. తలలేని అతని శరీర భాగానికి తన దుస్తులను వేశాడు. 

దొంగల చేతిలో జార్ఖండ్‌ నటి హతం.. చోరీని ప్రతిఘటించడంతో కాల్పులు!

ఆ తర్వాత ఆ మొండెంను గుడ్డలో చుట్టి తన పొలంలో  పడేశాడు. అది చూసిన తన కుటుంబీకులు చనిపోయింది.. తానే అనుకుంటారని.. అలా వాళ్లను నమ్మించాలని పథకం వేసుకున్నాడు. అతడి ప్లాన్ ప్రకారమే.. మొండెం మీద ఉన్న దుస్తులను బట్టి చనిపోయింది సుభాష్ యేనని అనుకున్నారు కుటుంబ సభ్యులు. ఆ మేరకు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే, ఇది హత్య కేసు కావడంతో పోలీసుల దర్యాప్తులో భాగంగా  చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు. 

అందులో వారికి కనిపించిన దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. చనిపోయింది సుభాష్ అని భావిస్తున్న వారికి… చంపిందే సుభాష్ అని.. హతుడు, హంతకుడు ఒక్కడేనని తెలిసింది. వెంటనే పోలీసులు సుభాష్ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఎట్టకేలకు సోమవారం రాత్రి అతడిని అరెస్టు చేశారు. విచారణలో అతడిని ప్రశ్నించగా..  ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

PREV
click me!

Recommended Stories

Viral Video : మూత్రంతో కళ్లు కడుక్కుంటే మంచిదా..? ఈమె చేసింది కరెక్టేనా..? డాక్టర్లు ఏమంటున్నారంటే
పాకిస్థాన్‌కు ఇక ద‌బిడి దిబిడే.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న భార‌త ఆర్మీ. రంగంలోకి ల్యాండ్ అటాక్ క్రూజ్ మిస్సైల్స్‌