
సమోసాలను ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. అందుకే వీటిని రోజూ తినేవారు కూడా ఉన్నారు. ఇది నిజం.. కానీ సమోసాలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నారంటే నమ్ముతారా? కానీ దీన్ని మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందేనండి. అవును.. ఒకప్పుడు భారీ వేతనంతో ఉద్యోగాలు చేసి.. స్టార్టప్ ప్రపంచంలోకి ప్రవేశించి కర్ణాటక రాజధాని నగరంలో సమోసాలు అమ్మడం స్టార్ట్ చేశారు బాగా చదువుకున్న ఓ బెంగళూరు జంట. మీకు తెలుసా..? ఈ స్ట్రీట్ ఫుడ్ ఆ దంపతుల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం ఈ జంట లాభదాయకమైన ఉద్యోగాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. అంతేకాదు వారు సమోసాలను అమ్మడానికి ఏకంగా వారి సొంత ఇంటినే అమ్మారు. కానీ ఇప్పుడు వీరు కేవలం ఒక రోజుకు రూ .12 లక్షలు సంపాదిస్తున్నారు. అసలు వీళ్ల కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బయోటెక్నాలజీలో బీటెక్ చదువుతున్న సమయంలోనే శిఖర్ వీర్ సింగ్, నిధి సింగ్ ఫస్ట్ టైం హర్యానాలో కలుసుకున్నారు. ఇకపోతే వీరిద్దరికీ పెళ్లై ఐదేండ్లు దాటింది. అయితే హైదరాబాద్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో ఎంటెక్ పూర్తిచేశారు శిఖర్. అంతేకాదు బయోకాన్ లో బయోకాన్ లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా పనిచేశారు కూడా. కానీ ఈయన 2015లోనే ఆా ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ సమయంలో నిధి గుర్గావ్ లోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఏడాదికి రూ.30 లక్షల ప్యాకేజీతో వర్క్ చేస్తోంది.
అయితే చదువుకునే రోజుల్లోనే శిఖర్ కు సమోసాలు అమ్మాలనే ఆలోచన వచ్చిందట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ల వెలుపల సమోసాలు అమ్మమాలని కలలుగన్నాడు. కానీ అంత చదివి ఈ వ్యాపారం చేస్తారా? తనకున్న డిగ్రీలను దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తగా మారాలని నిర్ణయించుకున్నాడు. అయితే 2015లో ఓ రోజు ఫుడ్ కోర్టులో ఓ పిల్లాలు సమోసా కోసం ఏడవడం చూసాడట. అంతే అప్పుడే ఎట్టిపరిస్థిలోనైనా సమోసాల బిజినెస్ పెట్టాలని. ఉన్నపలంగా సైంటిస్ట్ ఉద్యోగం మానేసి బెంగళూరు వెళ్లి 'సమోసా సింగ్' ను ప్రారంభించాడు. అయితే ఈ సమయంలో నిధి సింగ్ గురుగ్రామ్లోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో రూ.30 లక్షల వార్షిక ప్యాకేజీతో బెస్ట్ పొజీషన్ లో పనిచేస్తోంది
నిధి, శిఖర్ ఇద్దరూ బాగా స్థిరపడిన కుటుంబానికి చెందినవారు. అయితే వారు సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నారు. అలాగే వారి పొదుపుతోనే 'సమోసా సింగ్' ను ప్రారంభించారు. అంతేకాదు కిచెన్ చిన్నగా ఉండటం, దానికి ఎక్కువ డబ్బులు అవసరపడటంతో రూ.80 లక్షల విలువైన తమ కలల ఇంటిని కూడా అమ్మేసారు. తెలుసా? వారి వ్యాపారం ఎంతగా పెరిగిందంటే నేడు కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.45 కోట్లు అంటే రోజుకు రూ.12 లక్షలన్నమాట.
భారతదేశం అంతటా 40 కి పైగా అవుట్లెట్లతో వీరు బటర్ చికెన్ సమోసా, కడై పనీర్ సమోసాలకు ప్రసిద్ది చెందారు. ఇప్పుడు వీరు మరిన్ని రుచులతో, మరిన్ని నగరాలలో తమ వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తున్నారు. వారు పానీ పూరీ, దహీ పూరీ, మసాలా పూరీ, వడా పావ్, దబేలి, సమోసా ప్లేటర్, జజీరా, గులాబ్ జామూన్, మూంగ్ దాల్ హల్వాతో పాటుగా మరెన్నో అమ్ముతున్నారు. వీరి కథ ఎందరికో స్ఫూర్తినిచ్చింది. నెటిజన్లు వారి అభిరుచి, అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు.