పెగాసెస్‌పై చర్చకు పట్టు: రాజ్యసభ నుండి ఆరుగురు టీఎంసీ ఎంపీల సస్పెన్షన్

By narsimha lodeFirst Published Aug 4, 2021, 2:53 PM IST
Highlights

 ఆరుగురు టీఎంసీల ఎంపీలను ఒక్క రోజు పాటు రాజ్యసభ నుండి  సస్పెన్షన్ చేస్తూ చైర్మెన్ వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకొన్నారు. పెగాసెస్ అంశంపై చర్చకు ఎంపీలు ప్లకార్డులతో వెల్ లో నిరసన తెలిపారు.

న్యూఢిల్లీ:రాజ్యసభ నుండి ఆరుగురు టీఎంసీ ఎంపీలను ఒక్క రోజు సస్పెండ్ చేశారు. సభలో గందరగోళ వాతావరణం సృష్టించినందుకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది.జపెగాసెస్ అంశంపై చర్చకు టీఎంసీ ఎంపీలు సభలో పట్టుబట్టారు. ఎండి,నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాస్, శాంత ఛైత్రి, అర్పిత ఘోష్, మౌసం నూర్ లు రాజ్యసభ వెల్ లో ప్లకార్డులు చేతబూని నిరసనకు దిగారు. రాజ్యసభ ఛైర్మెన్ ఆదేశాలను కూడ పాటించలేదు.

ఆరుగురు టీఎంసీల ప్రవర్తన సరిగా లేదని ఛైర్మెన్ అభిప్రాయపడ్డారు. ఆరుగురిని సభ నుండి వెంటనే సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆయన ఆదేశించారు.రాజ్యసభకు కొత్తగా ఎంపికైన జవహర్ సర్కార్ ప్రమాణం చేసిన తర్వాత ఎస్పీకి చెందిన రామ్‌గోపాల్ యాదవ్, విషంభర్ ప్రసాద్ నిషాద్ ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్టుగా రాజ్యసభ చైర్మెన్ తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలపై సీపీఎం ఎంపీ శివదాసన్ ఇచ్చిన  నోటీసును మరో నిబంధన కింద నోటీసును ఇవ్వాలని చైర్మెన్ సూచించారు.పెగాసెస్ అంశంపై సుఖేంద్ శేఖర్ రాయ్ (టీఎంసీ), మల్లిఖార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, (కాంగ్రెస్), కరీం(సీపీఎం),బినోయ్ విశ్వంలు 267 రూల్ కింద నోటీసులిచ్చారు. ఈ నోటీసులను రాజ్యసభ చైర్మెన్ తిరస్కరించారు

click me!