బసవరాజ్ బొమ్మై మంత్రివర్గంలో 29 మంది: లింగాయత్‌లకు పెద్దపీట

Published : Aug 04, 2021, 12:55 PM IST
బసవరాజ్ బొమ్మై మంత్రివర్గంలో 29 మంది: లింగాయత్‌లకు పెద్దపీట

సారాంశం

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గంలో 29 మంది ఉంటారని ప్రకటించారు. కొత్త మంత్రులు ఇవాళ ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీ నుండి బసవరాజ్ బొమ్మై బెంగుళూరుకు చేరుకొన్నారు.

బెంగుళూరు: కర్ణాటక సీఎం బసవరాజ్ మంత్రివర్గంలో 29 మందికి చోటు కల్పించనున్నారు. బుధవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు.యడియూరప్ఫ  రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై కొత్త సీఎంగా ప్రమాణం చేశారు. బొమ్మై తన మంత్రివర్గంలో 29 మందికి చోటు కల్పించనున్నారు.

తన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంలు ఉండరని ఆయన తేల్చి చెప్పారు. యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అయితే ఈ దఫా డిప్యూటీ సీఎంలు అవసరం లేదని పార్టీ నాయకత్వం ఆదేశించిందని ఆయన ఇవాళ మీడియాకు చెప్పారు.ఢిల్లీ నుండి నేరుగా ఆయన ఇవాళ బెంగుళూరుకు చేరుకొన్నారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బసవరాజ్ బొమ్మై ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. మంత్రివర్గ కూర్పుపై ఆయన పార్టీ అధిష్టానంతో చర్చించారు.బొమ్మై మంత్రివర్గంలో ఏడుగురు ఓబీసీలు, ముగ్గురు ఎస్‌సీలు, ఒక్క ఎస్టీ, ఏడుగురు ఒక్కలింగాయత్‌, ఎనిమిది మంది లింగాయత్‌లు, ఒక్క రెడ్డి, ఒక మహిళకు చోటు కల్పించనున్నారు. 


 
 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు