వయసు రెండేళ్లు.. బరువు 45కేజీలు..!

Published : Aug 04, 2021, 02:30 PM IST
వయసు రెండేళ్లు.. బరువు 45కేజీలు..!

సారాంశం

ఖ్యాతి పుట్టినప్పుడు కేవలం 2.5 కేజీల బరువు తో సాధారణంగానే పుట్టిందని.. కానీ ఆరు నెలలు వచ్చేనాటికి అనూహ్యంగా ఆమె బరువు 14 కిలోలకు చేరిందని వైద్యులు తెలిపారు.

ఆ పాప వయసు రెండేళ్లు. కానీ బరువు మాత్రం 45ఏళ్లు. ఈ వింత సంఘటన దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డిల్లీలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లో ఖ్యాతి అనే రెండేళ్లచిన్నారి చేరింది. ఆమె బరువు 45 కిలోలు ఉండటం గమనార్హం.  ఖ్యాతి పుట్టినప్పుడు కేవలం 2.5 కేజీల బరువు తో సాధారణంగానే పుట్టిందని.. కానీ ఆరు నెలలు వచ్చేనాటికి అనూహ్యంగా ఆమె బరువు 14 కిలోలకు చేరిందని వైద్యులు తెలిపారు.

రెండేళ్ల మూడు నెలల వయసు నాటికి చిన్నారి వయసు 45 కేజీలకు చేరిందని చెప్పారు. సాధారణంగా ఆ వయసు పిల్లలు 12-15 కిలోల బరువు మాత్రమే ఉంటారు. కానీ అధిక బరువు కారణంగా ఆ చిన్నారి చాలా సమస్యలు ఎదుర్కొందని చెప్పారు.  కనీసం వెల్లకిలా పడుకొని నిద్రపోవడానికి కూడా చిన్నారికి కుదరడం లేదన్నారు. నిద్రలో కూడా  శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోందని పాప తల్లిదండ్రులు తెలిపారు.

పాపను చక్రాల కుర్చీలో మాత్రమే కూర్చోపెట్టకలుగుతున్నామని చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు. దీంతో.. చిన్నారికి బేరియాట్రిక్ సర్జరీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సర్జరీ తమకు సవాలుగా మారిందని వైద్యులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport