Independence Day 2023: చరిత్ర గుర్తించినా నేటితరం గుర్తించని త్యాగధనులు వీళ్లు..

Published : Aug 04, 2023, 12:17 PM ISTUpdated : Aug 07, 2023, 12:15 PM IST
Independence Day 2023: చరిత్ర గుర్తించినా నేటితరం గుర్తించని త్యాగధనులు వీళ్లు..

సారాంశం

Independence Day 2023:  మన దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడం రావడం కోసం ఎందరో మహానుభావులు కష్టపడ్డారు. కానీ కొందరు మాత్రం చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. స్వాతంత్య్రం కోసం వీళ్లు కూడా ఎంతో పోరాడారన్న ముచ్చట కూడా బహుషా చాలా మందికి తెలియదు. మీరు ఎప్పుడూ వినని కొంతమంది స్వాతంత్ర్య సమరయోధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

Independence Day 2023:  బ్రిటిష్ వాళ్లు అన్నా.. ఆంగ్లేయులు అన్నా.. తెల్లదొరలు అన్నా.. ప్రతి భారతీయుడికి గుర్తుకు వచ్చేది ఆగస్టు 15 1947. ఎందుకంటే వీళ్లు చేసిన ఆకృత్యాలు అన్ని ఇన్నీ కావు మరి. తక్కువ కాలంలో ఎక్కువ లాభం పొందడానికి వీరు ఎంచుకున్న దోపిడి విధానంతో మన ఆర్థిక, సామాజిక, రాజకీయ సిద్ధాంతాలను దిబ్బతీశారు. మన దేశాన్నినిలువు దోపిడీ చేశారు. క్రమక్రమంగా మనల్ని బానిసలుగా చేసే ఎన్నో ఏండ్ల పాటు పాలించి మనకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిపోయారు. మనకోసం.. మనం స్వతంత్రంగా జీవించడం కోసం ఎందరో త్యాగదనులు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు అనేది నేటి తరానికి చాలా తక్కువ మందికే తెలుసు. అంతా పంద్రాగస్టు అంటే జెండా దగ్గర ఒక ఫోటో దిగి స్టేటస్ పెట్టుకుంటే చాలు దేశభక్తి ఉన్నట్టేనని ఫీలవుతుంటారు. కానీ ఒకప్పుడు జెండా పట్టుకుంటే చాలు తెల్ల ధరలు.. తలలు లేకుండా మన వాళ్లని చెట్టుకు వేలాడదీసే వారని ఎంత మందికి గుర్తొస్తుంది. చరిత్ర గుర్తించిన నేటి తరం గుర్తించని త్యాగదనులు ఎందరో ఉన్నారు. మరి ఈ పంద్రాగస్టు సందర్భంగా కొందరినైనా స్మరించుకోవడం మన కర్తవ్యం.. వారిలో కొంతమంది గురించి  ఇప్పుడు తెలుసుకుందాం..

వాసుదేవ్ బలవంతు ఫడ్కే 

ఈయనను  విప్లవాత్మక ఉద్యమాల పితామహుడు అనికూడా అంటారు. ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరించే బ్రిటిష్ అధికారులను ఈయన హతమార్చేవాడు. రోగాల బారిన పడిన ప్రజలకు, కరువుతో విలవిలలాడే ఎంతో సాయం చేసేవాడు. రహస్య సంఘాలను  స్థాపించి తన చుట్టూ  ఉన్నవారిలో ఉద్యమ స్ఫూర్తిని నింపేవాడు ఈ మహానీయుడు.

బిపిన్ చంద్రపాల్

ఈయన  1858 లో జన్మించారు. ఈయనకు  అతివాది అనే పేరు కూడా ఉంది. బిపిన్ చంద్రపాల్ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి గొప్ప వక్త రచయితగా పేరు గాంచారు.  బెంగాల్ వ్యతిరేక ఉద్యమంలో అత్యంత చురుకుగా పాల్గొన్నాడు బిపిన్ చంద్రపాల్. దేశానికి పూర్తి స్వతంత్రం రావాలని  కోరుకునేవాడు ఈయన. ఈయన ప్రసంగం తోటి యువతీ యువకుల్లో ఉత్సాహాన్ని నింపేవాడు.

చిలకమర్తి లక్ష్మీనరసింహం

చిలకమర్తి లక్ష్మీనరసింహం రాజమండ్రి నుంచి మనోరమ అనే పత్రిక నడిపేవాడు.  ఒక సందర్భంలో ఈయన ఒక పద్యం కూడా పాడారు.

భరతఖండంబు చక్కని పాడియావు 
 ఇండియన్లు  లేగ దూడలై
 ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియకట్టి

స్వతంత్ర ఉద్యమ కాలంలో  ఈ పద్యాన్ని ప్రతి సభలోను చదివి  వినిపించి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపేవారు. యువతి యువకుల్లో స్వతంత్ర కాంక్షను రగిలించేవారు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు.

చిదంబరం పిళ్లై

ఈయన మద్రాసు ప్రాంతపు వ్యక్తి.  బ్రిటిష్ వారి వ్యాపారాన్ని వ్యతిరేకిస్తూ ఎలాగైనా గుత్త వ్యాపారాన్ని అనచాలన్న కాంక్షతో ఒక వాణిజ్య నౌకను  కొని విదేశాలకు  సరుకులను ఎగుమతి చేశాడు. లాభనష్టాలు చూడకుండా సరుకులు ఎగుమతి చేయడాన్ని చూసి బ్రిటీష్ వారు తట్టుకోలేకపోయారు. నువ్వు మాతోని పోటీ చేస్తావా అని చిదంబరం గారిని అరెస్టు చేసి జైల్లో వేశారు. 

మేడం బికాజీకామా
 
ఈమెను భారత విప్లవకారుల మాత (మదర్ ఆఫ్ ఇండియన్  రెవల్యూషనరీస్) అని అంటారు. విదేశాల్లో ఉంటూ భారత స్వతంత్ర ఉద్యమానికి సహాయ సహకారాలు ఎంతో అందించారు ఈమె. ప్యారిస్ లో
వందేమాతరం అనే విప్లవ పత్రికను ముద్రించి మన దేశానికి పంపించింది. 1907 ఆగస్టు 22న జర్మనీలోని స్టార్ట్ గార్డ్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ లో విదేశాల్లో ఒక త్రివర్ణ పతాకం తయారు చేసి ప్రదర్శించింది.

చంద్రశేఖర్ ఆజాద్

ఈయన అసలు పేరు చంద్రశేఖర్  సీతారాం తివారి. సహాయ నిరాకరణ ఉద్యమంలో కొరడా దెబ్బలు తిన్న ప్రతిసారి గాంధీజీ కి జై అంటూ నినాదాలు  చేశాడు. ఈ సంఘటన తర్వాత  ఒక వార్తాపత్రిక ఈయనను ఆజాద్ గా కీర్తించింది. ఆజాద్ అనే పదానికి అర్థం స్వేచ్ఛ. ఒక సందర్భంలో బ్రిటీష్ పోలీసులతో పోరాడుతూ వారికి పట్టుబడడం ఇష్టం లేక తన తుపాకితో తానే కాల్చుకొని మరణించాడు. చెప్పుకుంటూ పోతే ఇలా ఎందరో ఉన్నారు. కానీ నేడు గుర్తించబడుతున్నది మాత్రం కొందరే. 

PREV
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu