రీల్స్ పిచ్చి.. ఏకంగా కదిలే ఎస్ యూవీపై కూర్చొని...!

Published : Aug 04, 2023, 11:40 AM ISTUpdated : Aug 04, 2023, 11:42 AM IST
 రీల్స్ పిచ్చి.. ఏకంగా కదిలే ఎస్ యూవీపై కూర్చొని...!

సారాంశం

ఆ సమయంలో తన చేతితో 1 మిలియన్  అనే బెలూన్ పట్టుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

ఈ కాలం యువతకు సోషల్ మీడియా పిచ్చి బాగా పట్టింది. ఒకప్పుడు మంచిగా చదివితేనే కెరీర్ ఉంటుంది అని అనుకునేవారు. కానీ, ఈ కాలం యువత సోషల్ మీడియానే తమ కెరీర్ గా మార్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం, ఫాలోవర్స్ పెంచుకోవడం, దాని ద్వారా డబ్బులు సంపాదించడం మొదలుపెడుతున్నారు.

అయితే,  తాజాగా ఓ అమ్మాయికి ఈ సోషల్ మీడియా ద్వారా ఆమెకు ఏకంగా ఒక మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఈ ఆనందాన్ని తట్టుకోలేక ,ఎస్ యూవీ వాహనంపై కూర్చొని షికార్లు చేసింది. ఆ సమయంలో తన చేతితో 1 మిలియన్  అనే బెలూన్ పట్టుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

కదులుతున్న ఎస్‌యూవీ బానెట్‌పై కూర్చున్న 25 ఏళ్ల మహిళను పోలీసులు సీరియస్ గా హెచ్చరించారు. వాహనం నడిపిన వ్యక్తిపై ఏకంగా కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జమ్మూ కశ్మీర్ లో చోటుచేసుకుంది.  జలంధర్-జమ్మూ జాతీయ రహదారిపై దాసుయా సమీపంలో ఉన్న సమయంలో మహిళ బోనెట్‌పై కూర్చొని షికార్లు చేసింది. 

 


ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో, రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ఎస్‌యూవీ యజమానిని పోలీసులు గుర్తించి, మోటారు వాహనాల చట్టం కింద వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు దసూయా స్టేషన్ హౌస్ ఆఫీసర్ బల్వీందర్ సింగ్ తెలిపారు. మహిళతో పాటు ఎస్‌యూవీలో ఉన్న ఇతర ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !