లోయలో పడిన బస్సు: ఆరుగురు మృతి 15 మందికి గాయాలు

Published : Jun 25, 2019, 08:14 AM IST
లోయలో పడిన బస్సు: ఆరుగురు మృతి 15 మందికి గాయాలు

సారాంశం

గర్హ్వా నుంచి జార్ఖండ్ వెళ్తున్న బస్సు తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో రక్షణ గోడను ఢీకొట్టి లోతైన ప్రవాహంలోకి పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. 

రాంచీ: జార్ఖండ్ లోని గర్హ్వాలో బస్సు ప్రమాదం సంభవించింది. బస్సు లోయలో పడిపోవడంతో ఆరుగురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 మంది ఉన్నారు. మరో 12 మంది ఇంకా బస్సులోనే ఉన్నారు. మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. 

గర్హ్వా నుంచి జార్ఖండ్ వెళ్తున్న బస్సు తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో రక్షణ గోడను ఢీకొట్టి లోతైన ప్రవాహంలోకి పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. 

గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిచారు. కుల్లు బస్సు ప్రమాదంలో 44 మంది మణించి వారం కూడా గడవక ముందే మరో ప్రమాదం సంభవించింది. 

PREV
click me!

Recommended Stories

ఈసారి చ‌లికాలం కూడా చ‌మ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం.. వాతావ‌ర‌ణంలో పెను సంచ‌ల‌నాలు
RBI: దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారనున్న ఆ 5 గండాలు.. రిజర్వ్ బ్యాంక్ బిగ్ అలర్ట్