పదో తరగతి పరీక్ష రాసిన 56 ఏళ్ల ఒడిశా ఎమ్మెల్యే...

Published : Apr 30, 2022, 09:17 AM ISTUpdated : Apr 30, 2022, 09:18 AM IST
పదో తరగతి పరీక్ష రాసిన 56 ఏళ్ల ఒడిశా ఎమ్మెల్యే...

సారాంశం

ఒడిశాలో ఓ ఎమ్మెల్యే 56యేళ్ల వయసులో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. కుటుంబపరిస్థితుల వల్ల చదువుకోలేకపోయానని.. ఇప్పటికైనా పదో తరగతి పూర్తి చేయాలనుకుంటున్నానని అన్నారు. 

ఒడిశా : ఒడిశా రాష్ట్రంలోని కొంధమాల్ జిల్లా పూల్భాణీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే (బిజద) అంగద kahaar 56 ఏళ్ల వయసులో పదో తరగతి ఆంగ్ల పరీక్ష రాశారు. శుక్రవారం పితాబరిలోని rujangi ఉన్నత పాఠశాలలోని స్టేట్ ఓపెన్ స్కూలింగ్ సర్టిఫికెట్ (ఎస్ఓఎస్ సీ)కేంద్రంలో ఆయన పరీక్ష రాశారు. ఉదయం చేతిలో అడ్మిట్ కార్డుతో మిగిలిన విద్యార్థులతో కలిసి ఆయన కేంద్రం బయట నిలుచుని కనిపించారు. కుటుంబ సమస్యల కారణంగా చదువు మధ్యలో ఆపేశానని, దీంతో పదో తరగతి పరీక్షలు రాయలేకపోయానని అంగద కహర్ తెలిపారు. తనకన్నా ఎక్కువ వయసున్నవారు కఠినంగా శ్రమించి చదువు పూర్తి చేసిన విషయం తెలుసుకున్నాని.. అతని కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో పరీక్షలు రాస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణుడవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !