
రాజస్థాన్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి కడుపులో 56 బ్లేడు ముక్కలు లభ్యమయ్యాయి. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయనను హాస్పిటల్ లో చేర్పించారు. దీంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ బ్లేడు ముక్కలను బయటకు తీశారు. ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.
నాటు నాటుకు ఆస్కార్.... అమూల్ స్పెషల్ డూడుల్...!
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంచోర్ లోని డాటా గ్రామానికి చెందిన 25 ఏళ్ల యశ్ పాల్ సింగ్ ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి బాలాజీ నగర్ ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో గత ఆదివారం అతడి స్నేహితులంతా పనులు మీద గది నుంచి బయటకు వెళ్లాడు. కానీ యశ్ పాల్ ఎక్కడికి వెళ్లకుండా గదిలో ఒక్కడే ఉన్నాడు.
కొంత సమయం తరువాత అతడికి ఒక్క సారిగా రక్తపు వాంతులు అయ్యాయి. దీంతో వెంటనే తన స్నేహితులకు ఈ విషయం ఫోన్ ద్వారా తెలియజేశాడు. యశ్ పాల్ సింగ్ ఆరోగ్యంపై కలత చెందిన వారంతా వెంటనే గది దగ్గరికి వచ్చారు. స్నేహితుడిని సంచోర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్లు అతడికి ఎక్స్ రే తీశారు. యువకుడి కడుపులో లోహపు ముక్కలు ఉన్నట్టు రిపోర్టులో తేలడంతో డాక్టర్ ఆశ్చర్యపోయారు. ఈ విషయంలో ఇంకా స్పష్టత కోసం డాక్టర్లు సోనోగ్రఫీ, ఎండోస్కోపీ నిర్వహించారు. దీంతో యశ్ పాల్ కడుపులో బ్లేడు ముక్కలు ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఆ వెంటనే ఆపరేషన్ నిర్వహించారు. కడుపులో నుంచి 56 బ్లేడు ముక్కలను బయటకు తీశారు.
కోడలి ముఖం, మర్మాంగంపై యాసిడ్ పోసిన అత్త.. కంటిచూపు కోల్పోయిన బాధితురాలు..
కాగా.. కడుపులోకి బ్లేడు ముక్కలు ఎలా వెళ్లాయనే విషయాన్ని యువకుడు చెప్పడం లేదు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. యశ్ పాల్ కవర్లతో కూడిన బ్లేడ్లను తిన్నాడని డాక్టర్లు చెప్పారు. అయితే ఆ సమయంలో కాగితం ఉండటం వల్ల నొప్పి, రక్తస్రావం జరగలేదు. కానీ కాగితం కడుపులో కరిగిపోయిన తరువాత నొప్పి ప్రారంభమైంది. ఫలితంగా గ్యాస్ ఏర్పడి ఆ వ్యక్తికి వికారంగా అనిపించింది. వాటిని తినడానికి ముందు ఆ వ్యక్తి బ్లేడ్లను రెండుగా విడగొట్టాడని డాక్టర్ తెలిపారు.
వారంలో మూడు రోజులు ఒక భార్యతో.. మరో మూడు రోజులు మరో భార్యతో.. ఆదివారం నీ ఇష్టం..అసలు కథేంటంటే...
అయితే యశ్ పాల్ సింగ్ ఎప్పుడూ మామూలుగానే ఉంటాడని బంధువులు తెలిపారు. అతడు ఈ చర్యకు పాల్పడటానికి కారణం ఏంటో తమకు తెలియదని చెప్పారు. యువకుడు కూడా ఈ విషయంలో మాట్లాడటానికి నిరాకరించాడు.