నాటు నాటుకు ఆస్కార్.... అమూల్ స్పెషల్ డూడుల్...!

Published : Mar 15, 2023, 09:43 AM IST
నాటు నాటుకు ఆస్కార్.... అమూల్ స్పెషల్ డూడుల్...!

సారాంశం

 తాజాగా అమూల్ స్పెషల్ డూడుల్ క్రియేట్ చేసి మరీ.... ఆర్ఆర్ఆర్ టీమ్ కి స్పెషల్ విషెస్ తెలియజేయడం విశేషం.

తెలుగు సినిమాకు అరుదైన ఘనత దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది. రాజమౌళి దర్శకత్వంలో తెరక్కెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కింది. బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తానికి ఆస్కార్ సాధించింది నాటు నాటు సాంగ్. ప్రపంచ వేదికపై కీరవాణి, చంద్రబోస్ ఈ అవార్డ్ ను అందుకున్నారు.

కాగా.... ఆస్కార్ లభించినందుకు ఈ సినిమా టీమ్ పై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ టీమ్ కి ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా... తాజాగా అమూల్ స్పెషల్ డూడుల్ క్రియేట్ చేసి మరీ.... ఆర్ఆర్ఆర్ టీమ్ కి స్పెషల్ విషెస్ తెలియజేయడం విశేషం.

 

ఆర్ఆర్ఆర్ కి గ్లోబల్ అవార్డు వచ్చినప్పుడు కూడా ఇదేవిధంగా డూడుల్ చేసిన అమూల్.. తాజాగా నాటు నాటు పాటలో ఎన్టీఆర్, చరణ్ లు ఇద్దరూ కలిసి స్టెప్పులు వేస్తున్నట్లుగా... డూడుల్ క్రియేట్ చేయడం విశేషం. ఆ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకరి చేతిలో ఆస్కార్ ని పెట్టగా.. మరొకరి చేతి వేళ్లకు అమూల్ బటర్ ని పూయడం విశేషం. తారక్, చరణ్ ల కార్టూన్లు అందరినీ ఆకట్టుకుంటన్నాయి. ఈ అమూల్ పోస్టుకి విపరీతంగా లైకులు రావడం విశేషం. అమూల్ వాళ్ల క్రియేటివిటీని నెటిజన్లు కొనియాడుతున్నారు. అమూల్ క్రియేటివ్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu