వ్యాక్సిన్ మరిచిపోయారా, అక్కర్లేదా, వేయించుకున్నా చెప్పడం లేదా: రాహుల్‌పై రవిశంకర్ ప్రసాద్ సెటైర్లు

By Siva KodatiFirst Published Apr 9, 2021, 10:00 PM IST
Highlights

కోవిడ్ వ్యాక్సిన్‌ను రాహుల్ గాంధీ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. దేశంలో టీకాలకు కొరత లేదని, ఆయనకి మాత్రం శ్రద్ధ కొరత ఉందంటూ కేంద్రమంత్రి సెటైర్లు వేశారు

కోవిడ్ వ్యాక్సిన్‌ను రాహుల్ గాంధీ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. దేశంలో టీకాలకు కొరత లేదని, ఆయనకి మాత్రం శ్రద్ధ కొరత ఉందంటూ కేంద్రమంత్రి సెటైర్లు వేశారు. అవసరమైన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కోరుతూ రాహుల్ గాంధీ..  ప్రధాని మోడీకి లేఖ రాసిన నేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్ ట్విటర్ ద్వారా ఘాటుగా స్పందించారు. 

రాహుల్ వ్యాక్సిన్‌ను అనుకోకుండా మర్చిపోయారా? ఆయనకు అక్కర్లేదా? లేదంటే బయటకు చెప్పకుండా చేసిన యాత్రల్లో ఎక్కడైనా ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే తీసుకుని, ఆ విషయాన్ని వెల్లడించడం లేదా? అంటూ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొరతగా ఉన్నది వ్యాక్సిన్ కాదని, ఆరోగ్య సంరక్షణ పట్ల మౌలిక నిబద్ధత అన్న సంగతిని రాహుల్ తెలుసుకోవాలని హితవు పలికారు. వసూలీ వెంచర్లను ఆపాలని తన పార్టీ ప్రభుత్వాలకు ఆయన లేఖలు రాయాలని కోరారు. తమ దగ్గర ఉన్న లక్షలాది వ్యాక్సిన్లను ప్రజలకు ఇవ్వడంపై దృష్టి పెట్టేలా చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ సూచించారు. 

మన దేశం యుద్ధ విమానాలను కొనడానికి చేసిన ప్రయత్నాలను దెబ్బతీయడానికి రాహుల్ గాంధీ యుద్ధ విమానాల కంపెనీల కోసం లాబీయింగ్ చేశారని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఇప్పుడు విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వాలంటూ విదేశీ కంపెనీల కోసం లాబీయింగ్ చేస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. 

click me!