
మహారాష్ట్రలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి కూతురితోనే అసభ్యంగా ప్రవర్తించాడు. శారీరకంగా వేధిస్తూ, అసభ్యంగా తాకుతూ, అశ్లీలంగా మాట్లాడుతూ వేధింపులకు గురి చేశాడు.
వివరాల్లోకి వెడితే మహారాష్ట్ర, పూణేలో కుమార్తెలో అసభ్యంగా ప్రవర్తించిన ఓ తండ్రిని పింప్రి చించ్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. 51యేళ్లున్న తండ్రి సవతి కుమార్తెతో అసభ్యంగా వ్యవహరించాడు. పదో తరగతి చదువుతున్న ఆ బాలికను 2016నుంచి అతడు శారీరకంగా వేధిస్తున్నాడు. అనుచితంగా తాకుతూ, అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
బాలిక తల్లి 2016లో అనారోగ్యంతో చనిపోయింది. దీంతో వేరే దిక్కులేక బాలిక తండ్రితోనే కలిసి ఉంటోంది. అయిదే ఆదివారం బాలికమీద తండ్రి లైంగిక దాడికి యత్నించగా ఆమె ఇంట్లోంచి పారిపోయింది. తనకు తెలిసిన వ్యక్తితో జరిగిన విషయాన్ని తెలిపింది.
దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి సామాజిక కార్యకర్తలకు, పోలీసులకు సమాచారం అందించాడు. కుమార్తెపై లైంగిక దాడికి యత్నించగా.. ఆమె ప్రతిఘటించింది. దీంతో అతను తలమీద కొట్టడంతో బాలికకు గాయాలయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు.