బోర్డర్ లో కలకలం.. పాకిస్థానీ అరెస్ట్

Published : Mar 07, 2019, 10:28 AM IST
బోర్డర్ లో కలకలం.. పాకిస్థానీ అరెస్ట్

సారాంశం

భారత్- పాక్ సరిహద్దుల్లో మరోసారి కలకలం రేగింది. గుజరాత్ లోని రణ్ ఆఫ్ కచ్ వద్ద.. భారత్- పాక్ సరిహద్దులో భారత బలగాలు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి.

భారత్- పాక్ సరిహద్దుల్లో మరోసారి కలకలం రేగింది. గుజరాత్ లోని రణ్ ఆఫ్ కచ్ వద్ద.. భారత్- పాక్ సరిహద్దులో భారత బలగాలు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. అతను పాకిస్థాన్ కి చెందిన వాడుగా అధికారులు గుర్తించారు.

సరిహద్దులో 50 ఏళ్ల వయసున్న పాకిస్తానీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) పట్టుకుందని ఓ అధికారి చెప్పారు. అతని పేరు మనహార్‌ సోటా అనీ, సింధ్‌ ప్రావిన్సులోని ఉమర్‌కోట్‌ జిల్లా వాసి అని అధికారి వెల్లడించారు.

అర్ధరాత్రి 2.40 సమయంలో అతను భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ సమయంలో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారని తెలిపారు. అతని వద్ద ఆయుధాలు తదితరాలేవీ దొరకలేదనీ, విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు. భద్రతా దళాలు చుట్టుముట్టగానే అతనే లొంగిపోయాడని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!