సుప్రీం కోర్టు స్టాఫ్ కి కరోనా పాజిటివ్.. ఇక న్యాయమూర్తులు సైతం ఇంటినుంచే..

By telugu news teamFirst Published Apr 12, 2021, 10:38 AM IST
Highlights

కరోనా తగ్గుముఖం పట్టేవరకు న్యాయమూర్తులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనున్నారు. కోర్టు హియరింగ్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విననున్నారని తెలుస్తోంది.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. మన దేశంలోనూ ఈ మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో ఈ మహమ్మారి విజృంభణ మరింత ఎక్కువగా ఉంది. సుప్రీం కోర్టులోని దాదాపు 50శాతం మంది సిబ్బంది కూడా కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో.. న్యాయమూర్తులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా తగ్గుముఖం పట్టేవరకు న్యాయమూర్తులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనున్నారు. కోర్టు హియరింగ్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విననున్నారని తెలుస్తోంది. కాగా.. సుప్రీం కోర్టు మొత్తం ఖాళీ చేసి... పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. వివిధ బెంచెస్ ఈ రోజు గంట ఆలస్యంగా టైమ్ షెడ్యూల్ చేశారు.

కేవలం ఒక్క శనివారం రోజే దాదాపు 44మంది సుప్రీం కోర్టు సిబ్బందికి కరోనా పాజిటివ్ ా తేలింది. దాదాపు చాలా మంది సిబ్బంది, లా క్లర్కులకు కరోనా సోకినట్లు గుర్తించారు. కొంతమంది న్యాయమూర్తులకు కూడా పాజిటివ్ రాగా.. తర్వాత వారు కోలుకున్నారు.

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. దాదాపు 10లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత వారం రోజుల నుంచి ఈ కేసుల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. వరసగా ఆరో రోజు లక్ష కేసులకు పైగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 904 మంది ప్రాణాలు కోల్పోయారు. 

click me!