ఒడిశాలోని థియేటర్లకు పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా దెబ్బ

By telugu teamFirst Published Apr 12, 2021, 10:26 AM IST
Highlights

ఒడిశాలోని రెండు థియేటర్లకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా దెబ్బ తగిలింది. కోవిడ్ నిబంధనలను పాటించలేదనే కారణంతో రెండు థియేటర్లను అధికారులు సీల్ చేశారు.

భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మానియా కొనసాగుతోంది. థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఒడిశాలోని రెండు థియేటర్లకు వకీల్ సాబ్ దెబ్బ తగిలింది. 

ఒడిశాలో వకీల్ సాబ్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు పవన్ కల్యాణ్ అభిమానులు దండిగా వస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలను పాటించని రెండు సినిమా థియేటర్లపై అధికారులు కొరడా ఝళిపించారు. గజపతి జిల్లా పర్లాఖేముండి పట్టణంలోని రెండు థియేటర్లలో వకీల్ సాబ్ సినిమా విడుదలైంది. 

సినిమా చూసేందుకు ఆ రెండు థియేటర్లకు పెద్ద యెత్తున ప్రేక్షకులు వచ్చారు. పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద యెత్తున థియేటర్లకు చేరుకున్నారు. ఈ సందర్భంలో థియేటర్ల యాజమాన్యాలు కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ రెండు సినిమా థియేటర్లను అధికారులు తాత్కాలికంగా సీల్ చేశారు. 

కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని అధికారులు సూచించారు. పింక్ హిందీ సినిమా ఆధారంగా వకీల్ సాబ్ సినిమా నిర్మితమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వకీల్ గా నటించాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను పవన్ కల్యాణ్ పోషించారు.

click me!